తెలంగాణ

telangana

ETV Bharat / sitara

కోర్టుకు హాజరైన నటి కంగనా రనౌత్​ - జావేద్ అక్తర్

జావేద్​ అక్తర్ వేసిన పరువు నష్టం కేసు​ విచారణలో భాగంగా ముంబయి అంధేరి మేజిస్ట్రేట్ కోర్టులో హాజరయ్యారు నటి కంగనా రనౌత్(Kangana Ranaut news update)​. తదుపరి విచారణను నంబరు 15కు వాయిదా వేసింది న్యాయస్థానం.

Actor Kangana Ranaut
నటి కంగనా రనౌత్​

By

Published : Sep 20, 2021, 2:02 PM IST

ప్రముఖ సినీ రచయిత జావేద్ అక్తర్ (Javed Akhtar latest news) వేసిన పరువు నష్టం కేసు విచారణ కోసం ముంబయిలోని అంధేరి మేజిస్ట్రేట్​ కోర్టు ముందు హాజరయ్యారు నటి కంగనా రనౌత్​(Kangana Ranaut news update). తదుపరి విచారణ అక్టోబరు 1న జరగాల్సి ఉండగా.. గడవు పెంచాలన్న రనౌత్​ తరఫు న్యాయవాది అభ్యర్థనతో నవంబరు 15కు వాయిదా వేసింది ధర్మాసనం.

కోర్టులో హాజరవడానికి వెళ్తున్న కంగనా రనౌత్​

గతేడాది జులై 19న ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న కంగన.. సుశాంత్ సింగ్ రాజ్​పుత్ ఆత్మహత్యకు, జావేద్ అక్తర్​కు ముడిపెడుతూ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఆ విషయమై నవంబరు 3న ఆమెపై పరువు నష్టం దావా వేశారు జావేద్​ అక్తర్​. ఈ కేసులో భాగంగానే గతంలో కంగనకు పలుమార్లు సమన్లు ఇచ్చిన న్యాయస్థానం.. బెయిలబుల్​ వారెంట్ కూడా జారీ చేసింది.

ఇవీ చూడండి:

ABOUT THE AUTHOR

...view details