చెట్లను నాటడం ప్రతి ఒక్కరి బాధ్యతని నటుడు గౌతం రాజు అన్నారు. సినీ నటుడు అశోక్ కుమార్ విసిరిన గ్రీన్ ఛాలెంజ్ స్వీకరించిన ఆయన... అత్తాపూర్లోని నివాసంలో తన కుమారుడు కృష్ణతో కలిసి మొక్కలు నాటారు.
గ్రీన్ ఇండియా ఛాలెంజ్: మొక్కలు నాటిన నటుడు గౌతం రాజు - telangana latest news
గ్రీన్ ఇండియా ఛాలెంజ్లో భాగంగా నటుడు అశోక్ కుమార్ నుంచి ఛాలెంజ్ స్వీకరించిన నటుడు గౌతం రాజు ఆయన నివాసంలో మొక్కలు నాటారు. రాజ్యసభ సభ్యుడు జోగినపల్లి సంతోష్ కుమార్ ప్రారంభించిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్లో భాగంగా... మొక్కలు నాటడం సంతోషంగా ఉందని ఆయన పేర్కొన్నారు.
గ్రీన్ ఇండియా ఛాలెంజ్: మొక్కలు నాటిన నటుడు గౌతం రాజు
సినీ నటీమణులు అన్నపూర్ణమ్మ , శ్రీ లక్ష్మి, దిల్లీ రాజేశ్వరి, సనకు... మొక్కలు నాటాలని ఛాలెంజ్ విసిరారు. కార్యక్రమంలో అత్తాపూర్ కార్పొరేటర్ రావుల విజయ జంగయ్య తదితరులు పాల్గొన్నారు.
ఇదీ చూడండి: గ్రీన్ ఛాలెంజ్: మొక్కలు నాటిన నటి, లోక్‌సభ ఎంపీ నవనీత్ కౌర్