'గల్లీ బాయ్'.. ఈ ఏడాది ఫిబ్రవరిలో విడుదలై ఘనవిజయం సాధించింది. ఇటీవలే మెల్బోర్న్ ఫిల్మ్ ఫెస్టివల్లో ఉత్తమ చిత్రంగా అవార్డు గెల్చుకుంది. ఇప్పుడు జపాన్లో విడుదలకు సిద్ధమవుతోంది. జపనీయులను వచ్చే నెలలో పలకరించనుంది. ఈ విషయాన్ని హీరో రణ్వీర్ సింగ్ స్వయంగా తెలిపాడు.
"గల్లీ బాయ్ జపాన్లో విడుదలకానుంది. ఇందుకు ఎంతో గర్వంగా, సంతోషంగా ఉంది. నేను ఇంతవరకు జపాన్ వెళ్లలేదు. సూర్యుడు మొదట ఉదయించే ఆ నేలపై ఎన్నో అద్భుతమైన విషయాలు ఉన్నాయని విన్నాను" -రణ్వీర్ సింగ్, బాలీవుడ్ హీరో.