బాలీవుడ్ నటుడు, కథక్ డ్యాన్సర్ వీరూ కృష్ణన్.. శనివారం ముంబయిలో మృతిచెందారు. ప్రముఖ నటులు ప్రియాంక చోప్రా, కత్రినా కైఫ్, కరణ్వీర్ బోహ్రా లాంటి ఎంతో మందికి నృత్యంలో ఈయన శిక్షణ ఇచ్చారు. 'ఇష్క్', 'హమే హే రహీ ప్యార్ కే', 'రాజా హిందుస్థానీ' లాంటి విజయవంతమైన చిత్రాల్లో నటించి గుర్తింపు తెచ్చుకున్నారు.1990ల్లో ఆమిర్ ఖాన్ చిత్రాల్లో ఎక్కువగా నటించేవారు వీరూ కృష్ణన్. ఆయన మృతిపట్ల పలువురు సినీ ప్రముఖులు సంతాపం వ్యక్తం చేశారు.
"వీరూ కృష్ణన్ చనిపోవడం చాలా విచారకరమైన వార్త. గురూజీ కుటుంబానికి నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నా. కథక్ పట్ల ఆయనకున్న నిబద్ధత, ఓపికతో విద్యార్థులకు ఉన్నతమైన గురువుగా మిగిలిపోయారు" - లారా దత్తా, బాలీవుడ్ నటి