తమిళంతో పాటు.. తెలుగు, హిందీ భాషల్లోనూ అభిమానులను సంపాదించుకున్న నటుడు విక్రమ్. 'పితామగన్'లో తనదైన నటనకు జాతీయ అవార్డు సొంతం చేసుకున్నాడు. 1990లో 'ఎన్ కాదల్ కణ్మణి' చిత్రంతో పరిచయమైన అతడు.. అరంగేట్రంలోనే మలయాళం, తెలుగు భాషల్లో నటించాడు. 'చిరునవ్వుల వరమిస్తావా'తో తొలిసారి తెలుగుతెరపై కనువిందు చేశాడు విక్రమ్. ఆ తర్వాత 'విక్కీ' అనే మరో సినిమా చేశాడు.
'బంగారు కుటుంబం', 'ఆడాళ్లా మజాకా', 'ఊహ', 'అక్క బాగున్నావా'... ఇలా 90వ దశకంలో పలు తెలుగు సినిమాలు చేశాడు. తమిళంలో స్టార్ కథానాయకుడిగా గుర్తింపు తెచ్చుకొన్నాడు. ప్రస్తుతం కోలీవుడ్ ఇతడు చేసిన సినిమాలు తెలుగులోనూ అనువాదాలుగా విడుదలవుతున్నాయి. విక్రమ్‌కి తెలుగునాట మంచి గుర్తింపు ఉన్నప్పుడే... 'శివపుత్రుడు', 'అపరిచితుడు' చిత్రాలు తీశాడు. ఇవి సూపర్హిట్లు కావడం వల్ల అతడికి అభిమానులు మరింత పెరిగారు. 'రావణ్', 'నాన్న' చిత్రాలతో విక్రమ్ ప్రేక్షకులను మెప్పించాడు. శంకర్ దర్శకత్వం వహించిన 'ఐ' కోసం అతడు.. భారీగా బరువు తగ్గి నటించాడు.
కెరీర్లో భారీ బడ్జెట్ చిత్రాలు..