తెలంగాణ

telangana

ETV Bharat / sitara

గుండెపోటుతో ప్రముఖ హీరో మృతి - హీరో చిరంజీవి మృతి

తమిళ, తెలుగు సినిమాలతో గుర్తింపు తెచ్చుకున్న నటుడు, అర్జున్ మేనల్లుడు చిరంజీవి సర్జా.. గుండెపోటుతో ఆదివారం మరణించారు.

గుండెపోటుతో హీరో చిరంజీవి సర్జా మృతి
హీరో చిరంజీవి సర్జా

By

Published : Jun 7, 2020, 4:58 PM IST

Updated : Jun 8, 2020, 6:18 AM IST

ప్రముఖ కన్నడ కథానాయకుడు చిరంజీవి సర్జా (39) కన్నుమూశారు. శనివారం తీవ్ర ఛాతినొప్పి, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది ఎదురవడం వల్ల అతడిని బెంగళూరులోని ఓ ప్రైవేటు ఆసుపత్రికు తీసుకెళ్లారు. చికిత్స పొందుతున్న సమయంలో గుండెపోటు రావడం వల్ల మృతి చెందారు.

నటుడు చిరంజీవి సర్జా

చిరంజీవి మృతితో కన్నడ చిత్ర పరిశ్రమలో విషాద ఛాయలు కమ్ముకున్నాయి. పలువురు సినీ ప్రముఖులు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఓ గొప్ప నటుడ్ని కోల్పోయామని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ బాధను తట్టుకునే శక్తిని దేవుడు ఆయన కుటుంబ సభ్యులకు ఇవ్వాలని ప్రార్థిస్తున్నట్లు తెలిపారు.

గుండెపోటుతో ప్రముఖ హీరో మృతి

చిరంజీవి.. ప్రముఖ నటుడు అర్జున్​కు మేనల్లుడు. సర్జా 2009లో నటుడిగా కెరీర్‌ ఆరంభించారు. అనేక సినిమాల్లో కథానాయకుడిగా మెప్పించి, యాక్షన్‌ హీరోగా గుర్తింపు పొందారు. 2020లో చిరంజీవి సర్జా నటించిన 'సింగా', 'ఖాకీ', 'ఆద్యా', 'శివార్జున' సినిమాలు ప్రేక్షకుల ముందుకు వచ్చాయి. ఆయన చేతిలో ఇప్పుడు 'రాజమార్థాండా', 'ఏప్రిల్‌', 'రణం', 'క్షత్రేయ' సినిమాలు ఉన్నాయి. ఓ చిత్రం పోస్ట్‌ ప్రొడక్షన్‌ పనులు జరుపుకొంటుండగా.. మూడు సినిమాలు వివిధ దశల్లో ఉన్నాయి.

గుండెపోటుతో ప్రముఖ హీరో మృతి

2018 మే 2న చిరంజీవి సర్జా, నటి మేఘనా రాజ్‌ను వివాహం చేసుకున్నారు. క్రిస్టియన్‌ సంప్రదాయం ప్రకారం తమ పెళ్లి జరిగిందని, రెండేళ్లు పూర్తయిందని 2020 మే 2న మేఘనా రాజ్‌ ఇన్‌స్టాగ్రామ్‌లో వీడియో షేర్‌ చేశారు. ఆమె తెలుగులో 'బెండు అప్పారావు', 'లక్కీ' చిత్రాల్లో నటించారు.

Last Updated : Jun 8, 2020, 6:18 AM IST

ABOUT THE AUTHOR

...view details