తన ఆరోగ్యంపై వస్తోన్న వదంతులను ప్రేక్షకులెవరూ నమ్మవద్దని ప్రముఖ సినీనటుడు చంద్రమోహన్ విజ్ఞప్తి చేశారు. తాను పూర్తి ఆరోగ్యంగానే ఉన్నానని, ఇటీవల తనకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపిన వారందరికి చంద్రమోహన్ ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. చంద్రమోహన్ అనారోగ్యానికి గురయ్యారంటూ సామాజిక మాద్యమాల్లో వార్తలు చక్కర్లు కొట్టాయి.
ఆరోగ్యంపై స్పందించిన సినీనటుడు చంద్రమోహన్
తన ఆరోగ్యంపై వస్తోన్న వదంతులపై సినీనటుడు చంద్రమోహన్ స్పందించారు. తాను అనారోగ్యానికి గురయ్యానంటూ ప్రచారం జరుగుతున్న వార్తల్లో నిజం లేదని స్పష్టం చేశారు.
నేను ఆరోగ్యంగానే ఉన్నాను: చంద్రమోహన్
ఈ మేరకు స్వయంగా స్పందించిన చంద్రమోహన్.. ఓ ప్రత్యేక వీడియో విడుదల చేశారు. తాను ఆరోగ్యంగానే ఉన్నానని, ప్రజల అభిమానానికి, ఆశ్సీస్సులకు ఎప్పటికీ కృతజ్ఞుతుడైన ఉంటానని స్పష్టం చేశారు.
ఇదీ చూడండి:హాట్‌గా పూజా హెగ్డే.. చీరలో నివేదా!
Last Updated : May 25, 2021, 3:21 PM IST