నేచురల్ స్టార్ నాని సలహా వల్లే తన కుమారుడు సంజయ్‌ను హీరోగా ప్రేక్షకులకు పరిచయం చేస్తున్నానని ప్రముఖ నటుడు బ్రహ్మాజీ తెలిపాడు. చిన్న సినిమా అయినా ఆసక్తిగా కొనసాగుతుందని స్పష్టం చేశాడు. ఈ చిత్రం హిట్ అవుతుందన్న నమ్మకంతోనే ప్రముఖలతో ప్రచారం చేయించానన్నాడు.
నాని చెప్పినందుకే అలా చేశా: బ్రహ్మాజీ - o pitta katha movie updates
టాలీవుడ్లో అనేక పాత్రలతో ఆకట్టుకున్న నటుడు బ్రహ్మాజీ. అతడి కుమారుడు సంజయ్.. 'ఓ పిట్ట కథ' సినిమాతో వెండితెరకు పరిచయమవుతున్నాడు. శుక్రవారం ఈ సినిమా విడుదల సందర్భంగా పలు ఆసక్తికర విషయాలను ఈటీవీ భారత్‌తో పంచుకున్నాడు బ్రహ్మాజీ.
నాని చెప్పింనందుకే అలా చేశాను: బ్రహ్మాజీ
ఈ చిత్రానికి మెగాస్టార్ చిరంజీవి నుంచి రెబల్ స్టార్ ప్రభాస్ వరకు చాలా మంది ప్రోత్సహిస్తూ బ్రహ్మాజీ కుమారుడికి అభినందనలు తెలిపారు. సంజయ్ రావు, నిత్యా శెట్టి జంటగా బ్రహ్మాజీ కీలకపాత్రలో నటించిన 'ఓ పిట్ట కథ' చిత్రం ఈ నెల 6న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. చందు ముద్ద దర్శకత్వంలో భవ్యా క్రియేషన్స్ పతాకంపై సస్పెన్స్ థ్రిల్లర్‌గా తెరకెక్కించారు.
ఇదీ చూడండి.. ఆరేళ్ల వయసులోనే వేధింపులకు గురయ్యాను: నటి రష్మీ