ప్రముఖ నటుడు బిక్రమ్‌జిత్ కన్వర్పాల్(52).. కొవిడ్ ప్రభావంతో శనివారం ఉదయం మరణించారు. ఈ విషయాన్ని దర్శకుడు అశోక్ పండిట్ ట్విట్టర్ వేదికగా వెల్లడించి, నివాళి అర్పించారు.
కొవిడ్‌తో మరో ప్రముఖ నటుడు మృతి - Actor Bikramjeet Kanwarpal Covid-19
కొన్నిరోజుల క్రితం కరోనా బారిన పడ్డ బాలీవుడ్ ప్రముఖ నటుడు బిక్రమ్‌జిత్.. తుదిశ్వాస విడిచారు. దాదాపు 18 ఏళ్ల పాటు పలు భాషల్లోని సినిమాల్లో నటించి అభిమానుల్ని సంపాదించారు.
బిక్రమ్‌జిత్ కన్వర్పాల్
ఆర్మీ మేజర్‌గా దేశసేవ చేసి రిటైర్ అయిన బ్రికమ్జిత్.. 2003లో 'పేజ్ 3' సినిమాతో అరంగేట్రం చేశారు. ఆ తర్వాత రాకెట్ సింగ్, ఆరక్షణ్, మర్డర్ 2, టూ స్టేట్స్, ద ఘాజీ ఎటాక్ తదితర చిత్రాలతో పాటు ఎన్నో టీవీ షోల్లో సహాయ పాత్రలు షోపించి, గుర్తింపు తెచ్చుకున్నారు.