తెలంగాణ

telangana

ETV Bharat / sitara

'నాట్యం' చిత్రబృందానికి వెంకయ్యనాయుడు, బాలయ్య ప్రశంసలు - నాట్యం మూవీ రివ్యూ వెంకయ్యనాయుడు

ప్రముఖ కూచిపూడి నృత్యకారిణి సంధ్యారాజు నిర్మించి, నటించిన చిత్రం 'నాట్యం'(natyam movie review). ఈ సినిమా నేడు (అక్టోబర్ 22) ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ నేపథ్యంలో చిత్రబృందంపై ప్రశంసలు కురిపించారు ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు, నటుడు బాలకృష్ణ.

Natyam movi
నాట్యం

By

Published : Oct 22, 2021, 5:44 PM IST

'నాట్యం'(natyam movie review) చిత్రబృందానికి ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు, నటుడు బాలకృష్ణ(balakrishna natyam movie) శుభాకాంక్షలు తెలిపారు. నటి సంధ్యారాజుని సత్కరించారు. ఈ సినిమా నేడు (అక్టోబర్ 22) థియేటర్లలో విడుదలైన(నాట్యం సినిమా రివ్యూ)సందర్భంగా ఓ ట్వీట్ చేశారు వెంకయ్యనాయుడు.

"నాట్యకళ గొప్పతనాన్ని ఆవిష్కరిస్తూ కూచిపూడి నృత్య కళాకారిణి సంధ్యారాజు నటించిన 'నాట్యం' చక్కని చిత్రం. భారతీయ సంస్కృతిలో కళలకు ఇచ్చిన ప్రాధాన్యతను కళ్లకు కట్టేలా ఈ సినిమాని రూపొందించిన దర్శకుడు రేవంత్‌ కోరుకొండ, నటీనటులకు అభినందల" అని ట్వీట్‌ చేశారు.

ఇదో కళాఖండం : బాలకృష్ణ

'నాట్యం' స్పెషల్‌ షో చూసిన ప్రముఖ నటుడు నందమూరి బాలకృష్ణ(balakrishna natyam movie) చిత్రబృందానికి అభినందలు తెలిపారు. ఈ చిత్రం ఓ కళాఖండం అని ప్రశంసించారు. "నాట్యం.. ఇది సినిమా కాదు. ఓ కళాఖండం. మరుగునపడుతోన్న కళను తెరపైకి తీసుకొచ్చి, భావితరాలకు అందించే ప్రయత్నం చేశారు. దర్శకుడు రేవంత్‌ తాను అనుకున్న కథని అద్భుతంగా తెరకెక్కించారు. ఈ చిత్రాన్ని ఎన్నిసార్లు చూసినా తనివి తీరదు. నటులంతా తమతమ పాత్రలో ఒదిగిపోయారు. ప్రతి సన్నివేశం రక్తికట్టించేలా ఉంది. ఇలాంటి మంచి సినిమాను అందించినందుకు చిత్రబృందానికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నా" అన్నారు.

ఆదిత్యా మేన‌న్‌, రోహిత్ బెహ‌ల్‌, క‌మ‌ల్ కామ‌రాజు, భానుప్రియ‌, శుభ‌లేఖ సుధాక‌ర్‌ త‌దిత‌రులు కీలక పాత్రలు పోషించిన ఈ చిత్రానికి శ్రావణ్‌ భరద్వాజ్‌ సంగీతం అందించారు. విడుదలైన ప్రతిచోటా ఈ సినిమాకు ప్రేక్షకుల నుంచి మంచి స్పందన లభిస్తోంది.

ఇవీ చూడండి: 'నటుడు వివేక్ మృతికి వ్యాక్సిన్ కారణం కాదు'

ABOUT THE AUTHOR

...view details