'ఒకే ఒక్కడు' చిత్రంలో మాదిరిగా రాజకీయాల్లో రాణించడం చాలా కష్టమైన విషయమని యాక్షన్‌కింగ్ అర్జున్ పేర్కొన్నారు. ఆయన చెల్లి కుమారుడు ధ్రువసార్జా, రష్మిక జంటగా నటించిన పొగరు (సెమ తిమిరు) సినిమా విలేకర్ల సమావేశం చెన్నైలో జరిగింది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న అర్జున్ ఈ వ్యాఖ్యలు చేశారు.
'ఒకేఒక్కడు'లా రాజకీయాల్లో రాణించడం కష్టం: అర్జున్ - అర్జున్ రాజకీయాలపై
'ఒకేఒక్కడు' సినిమాలో మాదిరిగా సీఎంగా మారి.. ఆ స్థాయిలో ప్రజలకు సేవలు చేయడం సాధ్యంకాని పని అని అన్నారు నటుడు అర్జున్. రాజకీయాల్లో రాణించే అంత తెలివితేటలు తనలో లేవని చెప్పారు.
!['ఒకేఒక్కడు'లా రాజకీయాల్లో రాణించడం కష్టం: అర్జున్ arjun](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-10676883-713-10676883-1613640779836.jpg)
అర్జున్
"నాకు నచ్చిన సినిమా రంగంలో చాలా సంతోషంగా ఉన్నా. రాజకీయాల్లోకి ఎప్పుడు వస్తారని చాలా మంది నన్ను అడుగుతున్నారు. నిజానికి రాజకీయాలకు నేను అస్సలు పనికిరాను. ఆ తెలివితేటలు నాకు లేవు. టాలెంట్ ఎక్కువగా ఉండాలి. 'ఒకేఒక్కడు' సినిమాలో మాదిరిగా సీఎంగా మారి.. ఆ స్థాయిలో ప్రజలకు సేవలు చేయడం సాధ్యంకాని పని. అలా ఎవరూ రాలేర'ని అన్నారు.
ఇదీ చూడండి: అందగత్తెవా.. ఆకాశం నుంచి దిగివచ్చిన తారవా!