అభిమానులంతా టాలీవుడ్ పెద్ద సినిమాల అప్‌డేట్‌లు ఎప్పుడెప్పుడు వస్తాయా అని ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఈ క్రమంలోనే దర్శకధీరుడు రాజమౌళి ప్రతిష్ఠాత్మక చిత్రం 'ఆర్‌ఆర్‌ఆర్' గురించి ఒక విషయం బయటికి వచ్చింది.
ఈ సినిమాలో నటిస్తున్న ఐరిష్(ఐర్లాండ్) నటి అలిసన్ డూడీ ఇన్‌స్టాలో ఓ పోస్టు చేసింది. అందులో 'ఆర్‌ఆర్‌ఆర్'.. ఈ ఏడాది అక్టోబర్ 8న విడుదల కానుందంటూ ప్రకటించింది. ఆ పోస్టు వైరల్ కాకముందే వెంటనే తొలగించింది. ఆమె అనుకోకుండా చేసిన ఆ పోస్టులో నిజమెంత? అనేది తెలియాలంటే అధికారికంగా ప్రకటించే వరకూ ఆగాల్సిందే.