Ajith New Look: నెరిసిన గడ్డంతోనే ఉన్నా.. యమ స్టైలిష్గా కనిపిస్తారు తమిళ స్టార్ హీరో అజిత్ కుమార్. ఆయన ఇటీవలే తెల్ల జుత్తు, నెరిసిన గడ్డం, నల్ల కోటు, క్యూట్ కళ్లజోడుతో కనిపించి వారెవ్వా అనిపిస్తున్నారు . తన కుమారుడు అద్విక్ అజిత్ కుమార్ పుట్టినరోజు సందర్భంగా దిగిన ఈ ఫొటోలు ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో వైరల్గా మారాయి.
అజిత్ ట్రెండీ లుక్కు ఫిదా అయిన ఆయన అభిమానులు, నెటిజన్లు కామెంట్ల రూపంలో అభిప్రాయాలు పంచుకుంటున్నారు. సంబంధిత ఫొటోల్ని పోస్ట్ చేస్తూ 'సూపర్', 'లుక్ అదిరింది' అంటూ అభిమానాన్ని చాటుకుంటున్నారు.