తెలంగాణ

telangana

ETV Bharat / sitara

సినీ కార్మికుల కోసం హీరో అజిత్ విరాళం - Actor Ajith donates 10 lakhs rupees to FEFSI

కరోనా సెకండ్ వేవ్ ప్రభావంతో సినీ కార్మికులు, పనుల్లేక ఇబ్బందులు పడుతున్నారు. ఈ క్రమంలోనే వారికోసం రూ.10 లక్షల విరాళమిచ్చారు తమిళ కథానాయకుడు అజిత్.

Actor Ajith donates 10 lakhs rupees to FEFSI Union
హీరో అజిత్

By

Published : May 15, 2021, 4:02 PM IST

కొవిడ్​ పోరులో భాగంగా హీరో అజిత్, మరోసారి మంచి మనసు చాటుకున్నారు. తమిళనాడు ముఖ్యమంత్రి సహాయనిధికి ఇప్పటికే రూ.25 లక్షలు ఇచ్చిన ఆయన.. దక్షిణ భారత సినీ కార్మికుల ఫెడరేషన్​కు ఇప్పుడు రూ.10 లక్షలు విరాళమందించారు. ఈ విషయాన్ని ఎఫ్​ఈఎఫ్​ఎస్​ఐ అధ్యక్షుడు ఆర్​కె సెల్వమణి వెల్లడించారు.

ప్రస్తుతం 'వాలిమై' చిత్రంలో అజిత్ నటిస్తున్నారు. ఇందులో తెలుగు హీరో కార్తికేయ ప్రతినాయకుడిగా చేస్తున్నారు. హెచ్.వినోద్ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు. ఈ ఏడాది చివర్లో 'వాలిమై', థియేటర్లలోకి వచ్చే అవకాశముంది.

ఇది చదవండి:కరోనా బాధితుల కోసం హీరో అజిత్ భారీ సాయం

ABOUT THE AUTHOR

...view details