బాలీవుడ్ స్టార్ హీరో ఆమిర్ ఖాన్ కెరీర్లో సూపర్‌డూపర్ హిట్‌గా నిలిచిన చిత్రం 'పీకే'. విభిన్న కథాంశంతో రూపొందిన చిత్రం.. ప్రేక్షకులను అమితంగా ఆకట్టుకుని బాక్సాఫీసు వద్ద కలెక్షన్ల వర్షం కురిపించింది. ఇందులో గ్రహాంతరవాసి పాత్రలో కనిపించిన ఆమిర్.. ఎక్కువగా కిళ్లీలు నములుతూ చాలా సన్నివేశాల్లో కనిపించాడు. అయితే నిజజీవితంలో ఆమిర్‌కు కిళ్లీ అలవాటు లేదట.
'పీకే'లో ఆ పాత్ర పండటానికి పదివేల కిళ్లీలు! - పీకే సినిమా వార్తలు
ఏదైనా ఛాలెంజింగ్ పాత్ర దొరికితే చాలు.. అందులో పరకాయ ప్రవేశం చేయడానికి కథానాయకులు ప్రయత్నిస్తారు. అందులో బాలీవుడ్ హీరో ఆమిర్‌ఖాన్ ముందు వరుసలో ఉంటారు. 'దంగల్' చిత్రం కోసం బరువు పెరిగి మళ్లీ తగ్గారు. అదే విధంగా ఆయన నటించిన 'పీకే' సినిమా కోసం దాదాపుగా 10 వేల కిళ్లీలను ఆమిర్ నమిలారట.
'పీకే'లో ఆ పాత్ర పండటానికి పదివేల కిళ్లీలు!
అయితే 'పీకే' సినిమా కోసం ఒకటి కాదు, రెండు కాదు.. ఏకంగా 10 వేల కిళ్లీలను ఆమిర్ వేసుకున్నారట. "ఒకోసారి రోజుకు 100 కిళ్లీలు వేసుకోవాల్సి వచ్చేది. కావాల్సినప్పుడల్లా కిళ్లీలు కట్టడానికి ప్రత్యేకంగా ఓ మనిషిని, పూర్తి సరంజామాతో సెట్లోనే ఉంచుకున్నాం" అని ఆమిర్ ఖాన్ ఓ సందర్భంలో వెల్లడించారు. దాదాపుగా ప్రతి టేక్కు ఒక్కో కిళ్లీ వేసుకునేవారట. షూటింగ్ మొదలయ్యేలోగా నోరు, పెదాల రంగు తగినంత ఎర్రగా ఉండటానికి పది పదిహేను పాన్లను నమిలేవారట.