యువకథానాయకుడు ఆది సాయికుమార్, దర్శనా బానిక్ జంటగా ఓ చిత్రం తెరకెక్కుతోంది. జి.బి.కృష్ణ దర్శకత్వం వహిస్తుండగా.. మహంకాళి దివాకర్ నిర్మిస్తున్నారు. దీనికి 'బ్లాక్' అనే టైటిల్‌ను ఖరారు చేసినట్లు శనివారం చిత్ర బృందం ప్రకటించింది. దీంతో పాటు ఆది లుక్, కొన్ని వర్కింగ్ స్టిల్స్‌ను విడుదల చేసింది.
ఆది కొత్త సినిమాకు 'బ్లాక్' టైటిల్ ఖరారు - ఆది సాయికుమార్ కొత్త సినిమా అప్డేట్
ఆది సాయికుమార్, దర్శనా బానిక్ హీరోహీరోయిన్లుగా తెరకెక్కుతోన్న చిత్రానికి 'బ్లాక్' టైటిల్‌ను ఖరారు చేసినట్లు ప్రకటించింది చిత్రబృందం. దీంతో పాటు ఫస్ట్‌లుక్, వర్కింగ్ స్టిల్స్‌ను విడుదల చేసింది. ఆది గత చిత్రాల కంటే ఈ సినిమా భిన్నంగా ఉండబోతోందని నిర్మాత వెల్లడించారు.
ఆది కొత్త సినిమాకు 'బ్లాక్' టైటిల్ ఖరారు
ఈ సందర్భంగా నిర్మాత మాట్లాడుతూ.. "ఆది గత చిత్రాలకు భిన్నమైన పాత్రను ఇందులో పోషిస్తున్నారు. పోలీస్‌గా ఆయన పాత్ర ఎంతో కొత్తగా అనిపిస్తుంది. ఇది ఆయన కెరీర్‌లో ఓ మైలురాయిగా నిలుస్తుంది. భారీ సాంకేతిక విలువలతో నిర్మిస్తున్న ఈ చిత్రం ఇప్పటికే 70 శాతం చిత్రీకరణను పూర్తి చేసుకుంద"న్నారు.
ఇదీ చూడండి... తొలిసారి తెలంగాణ యాస పలకబోతున్న నాని!