మాస్ మహారాజ్ రవితేజ హీరోగా, రమేశ్ వర్మ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న చిత్రం 'ఖిలాడి'. యాక్షన్ నేపథ్యంలో రూపొందుతోన్న ఈ సినిమాలో ప్రతినాయకుడిగా యాక్షన్కింగ్ అర్జున్ను చిత్రబృందం ఎంపిక చేసిందని సమాచారం. ఇందులో పవర్ఫుల్ పాత్రలో అర్జున్ కనిపించనున్నారని ప్రచారం జరుగుతుంది. తమిళ, తెలుగు చిత్రాలతో మంచి గుర్తింపు తెచ్చుకున్న అర్జున్.. కొన్ని విలన్ పాత్రలతోనూ ప్రేక్షకులను మెప్పించారు. రవితేజ - అర్జున్ మధ్య భారీ యాక్షన్ సీక్వెన్స్ ఉండనున్న నేపథ్యంలో ఈ సినిమాపై ప్రేక్షకులలో అంచనాలు భారీగా పెరిగిపోయాయి.
'ఖిలాడి'లో విలన్గా యాక్షన్కింగ్ అర్జున్! - ఖిలాడి సినిమాలో అర్జున్
కథానాయకుడు రవితేజ కొత్త చిత్రం 'ఖిలాడి'లో ప్రతినాయకుడిగా యాక్షన్కింగ్ అర్జున్ను చిత్రబృందం ఎంపిక చేసిందని సమాచారం. యాక్షన్ నేపథ్యంలో తెరకెక్కనున్న చిత్రంలో వీరిద్దరి మధ్య భారీ పోరాట సన్నివేశాలను రూపొందించనున్నారని ప్రచారం జరుగుతోంది.
'ఖిలాడి'లో విలన్గా యాక్షన్కింగ్ అర్జున్!
ఈ చిత్రంలో రవితేజ సరసన మీనాక్షి చౌదరి, డింపుల్ హయాతీలు హీరోయిన్లుగా నటిస్తున్నారు. కోనేరు సత్యనారాయణ నిర్మాతగా వ్యవహరిస్తుండగా.. దేవీశ్రీప్రసాద్ సంగీతాన్ని అందిస్తున్నారు. 'వీర' చిత్రం తర్వాత రవితేజ-రమేశ్ వర్మ కాంబినేషన్లో తెరకెక్కుతోన్న చిత్రమిదే.