తెలంగాణ

telangana

ETV Bharat / sitara

హీరోయిన్​ పూర్ణ 'బ్యాక్​డోర్'​ ఎంట్రీ - పూర్ణ 'బ్యాక్​డోర్'

హీరోయిన్​ పూర్ణ ప్రధాన పాత్రలో 'బ్యాక్​డోర్'​ అనే సినిమా తెరకెక్కుతోంది. కర్రి బాలాజీ దర్శకత్వం వహిస్తున్నారు. బ్యాక్​డోర్​ ప్రవేశాల వల్ల ఎదురయ్యే విచిత్ర పరిణామాలను ఈ చిత్రంలో చూపించనున్నారు.

poorna
పూర్ణ

By

Published : Oct 13, 2020, 8:11 AM IST

ప్రముఖ నటి పూర్ణ ప్రధాన పాత్రలో 'బ్యాక్‌ డోర్‌' అనే సినిమా రూపొందుతోంది. కర్రి బాలాజీ దర్శకుడు. బి.శ్రీనివాస్‌ రెడ్డి నిర్మిస్తున్నారు. ఈ చిత్రం హైదరాబాద్‌లో సోమవారంలాంఛనంగా మొదలైంది. దర్శకుడు మాట్లాడుతూ "బ్యాక్‌డోర్‌ ప్రవేశాలు ఈరోజుల్లో అన్ని రంగాల్లో సాధారణమైపోయాయి. దీని వల్ల ఎదురయ్యే విచిత్ర పరిణామాల చుట్టూ అల్లుకున్న కథాంశంతో ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాం. పూర్ణ కెరీర్​లో మైలురాయిలా నిలిచే చిత్రమవుతుంది" అని అన్నారు. త్వరలోనే రెగ్యులర్​ చిత్రీకరణ ప్రారంభిస్తామన్నారు నిర్మాత శ్రీనివాస్​. ఈ సినిమాకు ప్రణవ్​ స్వరాలు సమకూరుస్తున్నారు.

ABOUT THE AUTHOR

...view details