నటిగా ప్రేక్షకుల మదిలో గుర్తుండిపోయే పాత్రలు చేయాలనుకుంటానని అంటోంది హీరోయిన్ రకుల్‌ప్రీత్ సింగ్. చిత్రపరిశ్రమలో ఎవరి సపోర్ట్ లేకుండా ఇన్నేళ్లు ప్రయాణం చేశానని చెబుతోంది. నటనలో మరింతగా రాణించాలని కోరుకుంటున్నట్లు తాజాగా వెల్లడించింది.
'కుటుంబ నేపథ్యం లేకున్నా సినిమాల్లో రాణిస్తున్నా' - rakul preet singh latest news
భగవంతుడి ఆశీర్వాదం, ప్రేక్షకుల ఆదరాభిమానాల వల్ల తాను ఇప్పటికీ హీరోయిన్గా కొనసాగుతున్నానని అంటోంది నటి రకుల్‌ప్రీత్ సింగ్. చిత్ర పరిశ్రమలో ఎలాంటి కుటుంబ వారసత్వం లేకుండా నటిగా మంచి గుర్తింపు తెచ్చుకున్నానని చెబుతోందీ అందాల భామ.
"సినీ నేపథ్యమున్న వాళ్లెవరూ మా కుటుంబంలో లేరు. ఎవరి అండ లేకుండా నాపై నాకున్న నమ్మకంతో ఈ రంగుల ప్రపంచంలోకి అడుగుపెట్టా. వచ్చిన అవకాశాలు నిలబెట్టుకున్నా. వరుస చిత్రాలతో తీరిక లేకుండా గడిపే స్థాయికి వెళ్లాలనుకున్నా. ఇప్పుడలాంటి ప్రయాణాన్ని మనస్ఫూర్తిగా ఆస్వాదిస్తున్నా. కథానాయికల సినీ కెరీర్ చాలా తక్కువ ఉంటుందని అంటుంటారు. నేనూ ఈ రంగంలోకి వచ్చినప్పుడు ఓ ఐదేళ్లయినా నా స్పీడు చూపించగలిగితే చాలనుకున్నా. కానీ, భగవంతుడి ఆశీర్వాదం, అభిమానుల ఆదరాభిమానాల వల్ల దశాబ్ద సినీ ప్రయాణానికి దగ్గరవుతున్నా. ఒక్కోసారి దీని గురించి ఆలోచిస్తుంటే ఏదో ఓ చక్కటి కలలా అనిపిస్తుంటుంది. కానీ, నటిగా నన్ను నేను మరింత సాన బెట్టుకోవాల్సి ఉంది. ప్రేక్షకుల మదిలో గుర్తుండిపోయేలా మరిన్ని గొప్ప పాత్రలు చేయాలి. అందుకే చేసే ప్రతి సినిమా నీ నా తొలి చిత్రమనుకొనే కష్టపడుతుంటా" అని రకుల్‌ప్రీత్ సింగ్ తెలిపింది.