Acharya movie teaser: మెగాస్టార్ చిరంజీవి హీరోగా కొరటాల శివ తెరకెక్కించిన సినిమా 'ఆచార్య'(chiru acharya movie). 'సిద్ధ'గా రామ్ చరణ్ కీలక పాత్ర పోషిస్తున్నారు. ఈ సినిమా విడుదల తేదీ దగ్గర పడుతున్న నేపథ్యంలో ప్రమోషన్స్‌ను వేవవంతం చేసింది చిత్రబృందం. ఇందులో భాగంగా నవంబర్ 28న సాయంత్రం 4.05గంటలకు రామ్‌చరణ్ పాత్రకు సంబంధించిన చిత్ర టీజర్‌ను రిలీజ్ చేయనున్నట్లు తెలిపింది. దీంతోపాటే ఓ మేకింగ్ వీడియోను విడుదల చేసింది.
'ఆచార్య' నుంచి 'సిద్ధ' టీజర్ రిలీజ్‌కు టైమ్ ఫిక్స్ - koratashiva acharya movie
Acharya movie teaser: మెగాస్టార్ చిరంజీవి, రామ్‌చరణ్ కలిసి నటిస్తున్న చిత్రం 'ఆచార్య'. ఈ సినిమాలో 'సిద్ధ'గా నటిస్తున్న చెర్రీకి సంబంధించిన టీజర్‌ను నవంబర్ 28న సాయంత్రం 4.05గంటలకు రిలీజ్ చేయనున్నట్లు తెలిపింది చిత్రబృందం. దీంతోపాటే ఓ మేకింగ్ వీడియోను రిలీజ్ చేసింది.
ఈ చిత్రంలో దేవాలయాల బాగు కోసం పాటుపడే పాత్రలో చిరు కనిపించనున్నారు. అలానే నక్సలైట్ పాత్రలోనూ అభిమానుల్ని అలరించనున్నారు. ఇప్పటికే వచ్చిన టీజర్, పాటలు ప్రేక్షకుల్ని ఆకట్టుకుంటూ, సినిమాపై అంచనాల్ని పెంచుతున్నాయి. ఇందులో చిరుకు జోడీగా కాజల్(kajal aggarwal in acharya), రామ్‌చరణ్‌కు(ram charan pooja hegde new movie) జోడీగా పూజా హెగ్డే నటించారు. కొణిదెల ప్రొడక్షన్, మ్యాట్నీ ఎంటర్టైన్మెంట్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. వచ్చే ఏడాది ఫిబ్రవరి 4న ఈ మూవీ ప్రేక్షకుల ముందుకు రానుంది.
ఇదీ చూడండి: పవన్-క్రిష్ మూవీ షూటింగ్ మరింత ఆలస్యం.. కారణమిదే!