తెలంగాణ

telangana

ETV Bharat / sitara

చిరు 'ఆచార్య'లో ప్రత్యేక గీతంపై రెజీనా స్పందన - chiru acharya

మెగాస్టార్​ 'ఆచార్య'లో ప్రత్యేక గీతం చేయడం తనకెంతో ఆనందంగా ఉందని చెప్పింది రెజీనా. అయితే ఇది సెలబ్రేషన్ సాంగ్ మాత్రమేనని అంది.

చిరు 'ఆచార్య'లో ప్రత్యేక గీతంపై రెజీనా స్పందన
హీరోయిన్ రెజీనా

By

Published : Mar 9, 2020, 9:13 AM IST

మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం 'ఆచార్య' సినిమాలో నటిస్తున్నాడు. కొరటాల శివ దర్శకుడు. షూటింగ్ శరవేగంగా సాగుతోంది. ముద్దుగుమ్మ రెజీనా ఇందులో ప్రత్యేక గీతంలో కనిపించి, అలరించనుంది. అయితే చిరుతో పనిచేయడం తనకు చాలా ఆనందంగా ఉందని చెబుతోంది. ఈ విషయమై ఇటీవలే ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ వివరణ ఇచ్చింది.

ముద్దుగుమ్మ రెజీనా

"ఈ ప్రత్యేక గీతం నా కెరీర్​లో మొదటిది, చివరిది. నటిగా విభిన్నంగా కనిపించాలనుకుంటున్నా. అందులో భాగంగానే ఇది ఒప్పుకున్నా. మరో విషయం ఏంటంటే ఇది ఐటెమ్ సాంగ్ కాదు సెలబ్రేషన్ సాంగ్" -రెజీనా, నటి

ఈ సినిమాలో త్రిష హీరోయిన్​గా నటిస్తోంది. మణిశర్మ సంగీతమందిస్తున్నాడు. మ్యాట్నీ ఎంటర్​టైన్​మెంట్స్, కొణిదెల ప్రొడక్షన్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. 'ఆచార్య' దసరాకు ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశముంది.

ABOUT THE AUTHOR

...view details