తెలంగాణ

telangana

ETV Bharat / sitara

'ఆచార్య'లో ఫుల్​ సాంగ్​కు చిరు-చరణ్​ డ్యాన్స్​.. ఫ్యాన్స్​కు పండగే

Chiranjeevi and Ram Charan Dance: మెగాస్టార్​ చిరంజీవి-మెగా పవర్​స్టార్​ రామ్​చరణ్​ కలిసి నటిస్తున్న చిత్రం 'ఆచార్య'. కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రానికి సంబంధించి ఇంకో ఆసక్తికర అప్​డేట్​ వచ్చింది. చిరు-చరణ్​ కలిసి ఓ ఫుల్​ సాంగ్​కు డ్యాన్స్​ చేస్తారని వెల్లడించారు కొరటాల.

acharya movie latest updates
'ఆచార్య'లో ఫుల్​సాంగ్​కు చిరు-చరణ్​ డ్యాన్స్​.. అభిమానులకు పండగే

By

Published : Dec 2, 2021, 4:22 PM IST

Updated : Dec 2, 2021, 4:38 PM IST

Chiranjeevi and Ram Charan Dance: మెగాస్టార్​ చిరంజీవి వేసే స్టెప్పులు అభిమానులకు పూనకాలు తెప్పిస్తాయి. 'ఆఫ్టర్​ ఏ లాంగ్​ గ్యాప్​ బాస్​ ఈజ్​ బ్యాక్​' అంటూ 'ఖైదీ నంబర్​ 150'తో రీఎంట్రీ ఇచ్చిన చిరు తన స్పీడును ఏ మాత్రం తగ్గించలేదు. అదే స్టైల్​, అదే గ్రేస్​తో డ్యాన్స్​ చేసి అభిమానులను అలరించారు. ఆ సినిమాలో మరో బోనస్​ 'అమ్మడు లెట్స్​ డూ కుమ్ముడు' పాట. ఎందుకంటే ఇందులో గెస్ట్​ రోల్​లో వచ్చిన మెగా పవర్​స్టార్​ రామ్​చరణ్​.. చిరుతో కలిసి కాసేపు స్టెప్పులు వేశారు. దీంతో వీరి కాంబినేషన్​లో మళ్లీ ఇంకో పాట ఎప్పుడు వస్తుందా అని ఎదురుచూస్తున్న అభిమానులకు 'ఆచార్య' దర్శకుడు కొరటాల శివ ఆసక్తికర అప్డేట్​ ఇచ్చారు.

అభిమానులకు ఫుల్​ మీల్స్!

ఇప్పటివరకు మెగాస్టార్​, మెగా పవర్​స్టార్​ కలిసి నటించినా.. ఓ పూర్తిపాటకు స్టెప్పులు వేసే అవకాశం రాలేదు. అయితే అభిమానులకు కొరటాల ఈ లోటును తీరుస్తున్నారు. 'ఆచార్య'లో సిద్ధ, ఆచార్యగా నటిస్తున్న రామ్​చరణ్​, చిరంజీవి ఒక పూర్తి పాటకు కలిసి డ్యాన్స్​ చేస్తారని కొరటాల ఇటీవల ఓ ఇంటర్వ్యూలో వెల్లడించారు. శేఖర్​ మాస్టర్​ కంపోజ్​ చేసిన స్టెప్పులు చక్కగా వచ్చాయని.. బాస్​ గ్రేస్​కు, చరణ్​ స్పీడుకు సరిగ్గా సరిపోయాయని అన్నారు.

'ఆశ్చర్యంతో ఉండిపోయా'

షూటింగ్​ జరిగినన్ని రోజులు వాళ్ల డ్యాన్స్​ చూసి ఆశ్చర్యంలో ఉండిపోయానని అన్నారు కొరటాల శివ. '5 లేదా 6 రాత్రులు జరిగిన ఈ పాట షూటింగ్​ చూడడానికి ఇండస్ట్రీకి చెందిన ఎందరో ప్రముఖులు వచ్చారు' అని తెలిపారు. అభిమానులకు ఇదో విజువల్​ ఫీస్ట్​ అవుతుందని.. త్వరలోనే ఈ పాటకు సంబంధించిన అప్డేట్​ రిలీజ్​ చేస్తామన్నారు కొరటాల.

ఇదీ చూడండి :చిరుత సీన్​పై స్పందించిన 'ఆచార్య' డైరెక్టర్ కొరటాల

Last Updated : Dec 2, 2021, 4:38 PM IST

ABOUT THE AUTHOR

...view details