*మెగాస్టార్ 'ఆచార్య' సినిమాలోని 'లాహే లాహే' సాంగ్ యూట్యూబ్‌లో దూసుకెళ్తోంది. ఈ క్రమంలోనే 60 మిలియన్ వ్యూస్ మార్క్‌ను ఆదివారం అధిగమించింది. దేవాలయాల నేపథ్య కథతో తీస్తున్న ఈ చిత్రంలో కాజల్ హీరోయిన్గా నటిస్తోంది. కొరటాల శివ దర్శకుడు. అక్టోబరులో థియేటర్లలోకి సినిమా వచ్చే అవకాశమున్నట్లు తెలుస్తోంది.
*యాంకర్ ప్రదీప్ హీరోగా నటించిన '30 రోజుల్లో ప్రేమించడం ఎలా?' ఆహా ఓటీటీలో సందడి చేయనుంది. జులై 2 నుంచి అందుబాటులోకి రానుంది. పునర్జన్మల నేపథ్య కథతో ఈ సినిమాను తెరకెక్కించారు. ఇందులో 'నీలి నీలి ఆకాశం' పాట అయితే ఇప్పటికీ శ్రోతల్ని అలరిస్తూనే ఉంది.