తెలంగాణ

telangana

ETV Bharat / sitara

మెగాస్టార్ 'ఆచార్య'కు అడుగడుగునా అడ్డంకులే! - chiranjeevi achayra shootin late

సెప్టెంబరులో మొదలు కావాల్సిన చిరంజీవి 'ఆచార్య' చిత్రీకరణ వాయిదా పడే అవకాశముంది. హైదరాబాద్​లో కరోనా కేసుల పెరుగుతుండడమే ఇందుకు కారణమని తెలుస్తోంది.

Koratala Siva
కొరటాల శివ

By

Published : Aug 29, 2020, 8:41 PM IST

మెగాస్టార్​ చిరంజీవి 'ఆచార్య'కు అవరోధాలు తప్పట్లేదు. షూటింగ్ మొదలైనప్పటి నుంచి ఏదో ఓ సమస్యతో ఆటంకం ఏర్పడుతూనే ఉంది. దీంతో ఎంతో ఉత్కంఠగా ఎదురుచూస్తున్న చిరు అభిమానులకు నిరాశే ఎదురవుతోంది.

ఇప్పటికే కరోనా వల్ల వాయిదా పడ్డ చిత్రీకరణ.. సెప్టెంబరులో తిరిగి ప్రారంభించాలని చిత్రబృందం భావించింది. కానీ హైదరాబాద్​లో రోజురోజుకు వైరస్​ కేసుల ఉద్ధృతి పెరుగుతోంది. దీంతో ప్రజల ఆరోగ్యానికే తొలి ప్రాధాన్యమిచ్చిన దర్శకుడు కొరటాల శివ.. షూటింగ్​ను వాయిదా వేయాలని భావిస్తున్నారట​. పరిస్థితి కుదుటపడిన తర్వాత నవంబరులో మొదలుపెట్టాలని అనుకుంటున్నారు.

'ఆచార్య'లో చిరు దేవదాయ-ధర్మాదాయ శాఖలో ఉద్యోగిగా కనిపించనున్నారు. కాజల్ హీరోయిన్. మణిశర్మ సంగీత దర్శకుడు. రామ్​చరణ్ ప్రత్యేక పాత్రలో నటిస్తున్నారు. ఈ సినిమాపై ఇప్పటికే ప్రేక్షకుల్లో భారీ అంచనాలు ఉన్నాయి. ఇటీవలే వచ్చిన ఫస్ట్​లుక్ మోషన్​ పోస్టర్ వాటిని మరికాస్త పెంచింది.​

ఇది చూడండి

ABOUT THE AUTHOR

...view details