తెలంగాణ

telangana

ETV Bharat / sitara

చైనా మొబైల్​ సంస్థ ప్రచారానికి ఆ హీరో గుడ్​బై? - latest bollywood actors news

చైనా మొబైల్​ సంస్థ ఒప్పో ప్రచార కర్త బాధ్యతల నుంచి బాలీవుడ్​ యంగ్​ హీరో కార్తీక్​ ఆర్యన్​ వైదొలిగినట్లు సినీవర్గాలు చెబుతున్నాయి. ఇటీవలే చైనా వస్తువులకు ప్రచారం చేయొద్దని సినీ ప్రముఖులకు ఆల్​ ఇండియా ట్రేడర్స్ సమాఖ్య లేఖ రాసింది. ఈ నేపథ్యంలోనే కార్తీక్​ ఈ నిర్ణయం తీసుకున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.

According to Bollywood sources, Karthik has cut a deal with Oppo brand
కార్తీక్​ ఆర్యన్​

By

Published : Jul 10, 2020, 10:47 AM IST

బాలీవుడ్‌ యంగ్‌ హీరో కార్తీక్‌ ఆర్యన్‌ చైనాకు చెందిన ఒప్పో మొబైల్స్‌కు ప్రచారకర్తగా ఉంటున్నాడు. తాజాగా ఆ బ్రాండ్‌తో ఒప్పందాన్ని కార్తీక్‌ వదులుకున్నట్లు బాలీవుడ్‌ వర్గాలు చెబుతున్నాయి. ఇటీవలే గల్వాన్‌ ఘటనతో చైనా- భారత్‌ మధ్య ఘర్షణ వాతావారణం నెలకొంది. చైనాకు గుణపాఠం చెప్పాలని భావించిన కేంద్ర ప్రభుత్వం.. ఆ దేశానికి చెందిన యాప్స్‌ను నిషేధించింది.

చైనా వస్తువులకు ప్రచారం చేయొద్దని కోరుతూ ఆల్‌ ఇండియా ట్రేడర్స్‌ సమాఖ్య గత నెలలోనే సినీ ప్రముఖులకు లేఖ రాసింది. ఈ నేపథ్యంలో కార్తీక్‌ ఆర్యన్‌ ఒప్పో ప్రచారాన్ని ఆపేశాడని వార్తలు వినిపిస్తున్నాయి. సోషల్‌మీడియాలో అతడు పెట్టిన ఓ ఫొటో ద్వారా ఈ విషయం వెలుగులోకి వచ్చింది.

కార్తీక్​ ఆర్యన్​

ఇటీవల కార్తీక్‌ ఆర్యన్‌ తన ఇంట్లో కిటికీ దగ్గర నిలబడి మేఘాలను తన ఫోన్‌లో ఫొటో తీస్తున్న చిత్రం ఒకటి సోషల్ మీడియాలో పోస్ట్‌ చేశాడు. అయితే కార్తీక్ పట్టుకున్న ఫోన్‌ ఐఫోన్‌ కావడం వల్ల నెటిజన్లు, అతడి అభిమానులు చైనా ఫోన్‌ ప్రచారాన్ని కార్తీక్‌ వదిలేశాడని చెబుతున్నారు.

వాస్తవానికి వ్యాపార ఒప్పందం ప్రకారం.. ఒకరు ఒక బ్రాండ్‌కి ప్రచారకర్తగా ఉన్నప్పుడు మరో బ్రాండ్‌ను సోషల్‌మీడియాలో ప్రచారం చేయకూడదు. ఒకవేళ అలా చేస్తే న్యాయపరమైన చిక్కులు ఎదుర్కోవాల్సి ఉంటుంది. ఈ విషయం తెలిసి కూడా కార్తీక్‌ ఐఫోన్ పట్టుకుని దిగిన ఫోటో సోషల్‌మీడియాలో పోస్ట్‌ చేయడం, ఒప్పో కోసం చివరగా జనవరిలో మాత్రమే ప్రచారం చేయడం చూస్తుంటే కార్తీక్‌ చైనా బ్రాండ్‌తో ఒప్పందం రద్దు చేసుకున్నట్లు తెలుస్తోంది. ఈవిషయంపై మరింత స్పష్టత రావాలంటే అతడు​ స్వయంగా ప్రకటించే వరకు వేచిచూడాల్సిందే.

ఇదీ చూడండి:టెస్టుకు కేరాఫ్​ అడ్రస్​.. బ్యాటింగ్​ దిగ్గజం 'గావస్కర్'​

ABOUT THE AUTHOR

...view details