సోషల్‌మీడియాలో ఓ నెటిజన్ వ్యంగ్యంగా అడిగిన ప్రశ్నకు తనదైన రీతిలో స్పందించాడు బాలీవుడ్ నటుడు అభిషేక్ బచ్చన్. డ్రగ్స్ కేసులో పలువురు సినీప్రముఖుల పేర్లు బయటపడుతున్న తరుణంలో అభిషేక్ చెప్పిన సమాధానం మరింత వైరల్‌గా మారింది.
నెటిజన్‌కు అభిషేక్ బచ్చన్ అదిరిపోయే రిప్లే - అభిషేక్ డ్రగ్స్ న్యూస్
బాలీవుడ్లో డ్రగ్స్ వినియోగం జరుగుతుందని ఆరోపణలు ఎదుర్కొంటున్న క్రమంలో నటీనటులపై సోషల్‌మీడియాలో తీవ్ర విమర్శలు వెల్లువెత్తున్నాయి. ఈ క్రమంలో తాజాగా ఓ నెటిజన్.. అభిషేక్ బచ్చన్‌పై కామెంట్ చేయగా దానికి తనదైన రీతిలో బదులిచ్చాడు జూనియర్ బచ్చన్.
బుధవారం ట్విట్టర్లో ఓ నెటిజన్ 'హ్యాష్ హై క్యా (హ్యాష్ ఉందా)' అని అభిషేక్‌ను ట్యాగ్ చేస్తూ ప్రశ్నించగా.. దానికి జూనియర్ బచ్చన్ స్పందించాడు. "లేదు! క్షమించండి. అయితే మీకు సహాయం చేయడం నాకు చాలా సంతోషంగా ఉంది. ముంబయి పోలీసులను సంప్రదించండి వారు కచ్చితంగా సహకారాన్ని అందిస్తారు" అని బదులిచ్చాడు.
అభిషేక్ బచ్చన్ చివరిసారిగా 'బ్రీత్: ఇన్ టూ ది షాడోస్' అనే వెబ్‌సిరీస్‌లో కనిపించాడు. ఇది జులై నుంచి అమెజాన్ ప్రైమ్ వీడియో ద్వారా ప్రేక్షకుల ముందుకొచ్చింది. అభిషేక్ నటించిన 'ది బిగ్ బుల్', 'లూడో' చిత్రాలు ఓటీటీల్లో విడుదలకు సిద్ధంగా ఉన్నాయి.