తనకు అవకాశమొచ్చినా సరే సూపర్‌స్టార్ ఆమిర్‌ఖాన్‌తో నటించని బాలీవుడ్ నటుడు అభిషేక్ బచ్చన్ చెప్పారు. ఏంటి వీరిద్దరి మధ్య గొడవ ఏమైనా జరిగింది? లేకపోతే మనస్పర్థలు వచ్చాయా? అని ఆలోచిస్తున్నారా. దీని గురించి ఇటీవలే ఓ ఇంటర్వ్యూలో మాట్లాడిన అభిషేక్.. నటించకపోవడానికి గల కారణాల్ని వెల్లడించారు.
"ఆమిర్‌ఖాన్‌తో తెరను పంచుకునే అదృష్టం 'ధూమ్-3'తో దక్కింది. ఒకవేళ ఇప్పుడు అతడి పక్కన నటించే అవకాశమొస్తే వద్దంటాను. ఎందుకంటే నాకు ఇప్పుడు ఆమిర్ దర్శకత్వంలో నటించాలని ఉంది. ఒకవేళ మీరు(ఆమిర్) దీనిని చదివితే నా విజ్ఞప్తి గురించి ఓసారి ఆలోచించండి" -అభిషేక్ బచ్చన్, బాలీవుడ్ ప్రముఖ నటుడు