తెలంగాణ

telangana

ETV Bharat / sitara

అభిషేక్​కు శస్త్రచికిత్స.. అయినా షూటింగ్​కు! - అభిషేక్​ బచ్చన్​ కొత్త సినిమా

తమిళ సినిమా రీమేక్​ చిత్రీకరణలో భాగంగా గాయపడిన హీరో అభిషేక్ బచ్చన్(abhishek bachchan) శస్త్రచికిత్స చేయించుకున్నాడు. తాను ఆరోగ్యంగానే ఉన్నట్లు తెలిపిన అభిషేక్​.. తిరిగి షూటింగ్​లో పాల్గొనడానికి చెన్నైకు చేరుకున్నట్లు ఇన్​స్టాలో తెలిపాడు.

Abhishek Bachchan
అభిషేక్ బచ్చన్

By

Published : Aug 26, 2021, 5:07 PM IST

సినిమా షూటింగ్​లో గాయపడిన ప్రముఖ కథానాయకుడు అభిషేక్​ బచ్చన్ తన కుడి చేయికి శస్త్రచికిత్స చేయించుకున్నట్లు తెలిపాడు. షూటింగ్ తిరిగి కొనసాగించడానికి చెన్నై వచ్చినట్లు తన ఇన్​స్టాలో వివరించాడు. గాయం బాధిస్తోన్నా.. ఓ సినిమాలో అమితాబ్​ ప్రసిద్ధ డైలాగ్​ ప్రేరణతో​ షూట్​కు వచ్చినట్లు తెలిపిన అభిషేక్​.. శస్త్రచికిత్స చేయించుకున్న ఫొటోను జోడించాడు.

కుడిచేతికి గాయంతో అభిషేక్​ బచ్చన్​

"గత బుధవారం.. చెన్నైలో కొత్త సినిమా షూటింగ్​ జరుగుతున్న సమయంలో ప్రమాదం జరిగింది. నా కుడి చేయి విరిగింది. దాన్ని సరి చేయడానికి శస్త్రచికిత్స చేయాల్సివచ్చింది! అందుకే ముంబయిలోని ఇంటికి వెళ్లి.. శస్త్రచికిత్స చేయించుకున్నా. షూటింగ్ తిరిగి కొనసాగించడానికి చెన్నై వచ్చా. ఏం జరిగినా పని ఆగకూడదు కదా! నా శ్రేయస్సు కోరుకున్నవారికి ధన్యవాదాలు."

- హీరో అభిషేక్​ బచ్చన్​

తమిళంలో ప్రేక్షకాదరణ పొందిన 'ఒత్తు సెరప్పు సైజు 7'కి(oththa seruppu size 7) రీమేక్​గా ఈ సినిమా తెరకెక్కిస్తున్నారు. ఈ చిత్రం మొత్తం ఒకే పాత్ర ఉంటుంది. ఒరిజినల్​లో పార్థిబన్ నటించగా, ఇప్పుడు హిందీలో అభిషేక్​ నటిస్తున్నారు. ఈ సినిమా చిత్రికరణలోనే అభిషేక్​ ప్రమాదానికి గురయ్యాడు.

తెలుగులోనూ ఈ సినిమాను రీమేక్​ చేయనుండగా.. బండ్ల గణేశ్(bandla ganesh) టైటిల్​ రోల్​లో నటించనున్నాడు.​ .

ఇదీ చూడండి:RRR: ఆర్​ఆర్​ఆర్​ షూటింగ్​ పూర్తి.. రిలీజ్​ వాయిదా!

ABOUT THE AUTHOR

...view details