ఇటీవలే కరోనా బారినపడ్డ బాలీవుడ్ హీరో అభిషేక్ బచ్చన్ శనివారం కోలుకున్నాడు. మధ్యాహ్నం వైద్యులు పరీక్షలు నిర్వహించగా నెగిటివ్గా తేలినట్లు అభిషేక్ ట్విట్టర్ వేదికగా తెలిపాడు. ఈ క్రమంలోనే ఈ మహమ్మారిని జయించినందుకు సంతోషం వ్యక్తం చేశాడు.
"మాటిచ్చిన తర్వాత తప్పను. ఈ రోజు మధ్యాహ్నం పరీక్షల్లో నాకు కరోనా నెగిటివ్ నిర్ధరణ అయ్యింది. దీన్ని జయిస్తానని మీకు చెప్పాను కదా. మా కుటుంబం కోసం ప్రార్థనలు చేసిన ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు. నానావతి ఆసుపత్రిలోని వైద్యులు, నర్సింగ్ సిబ్బందికి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నా."