తెలంగాణ

telangana

ETV Bharat / sitara

కుమార్తె కోసం రొమాంటిక్ సీన్స్​ చేయడం బంద్ - Abhishek news

తన కుమార్తెకు ఇబ్బందికలిగే రొమాంటిక్ సన్నివేశాలు, సినిమాల్లో అస్సలు నటించనని చెప్పాడు అభిషేక్ బచ్చన్. ఇలా చెప్పడం వల్లే ఇప్పటికే చాలా అవకాశాలు కోల్పోయానని వెల్లడించాడు.

Abhishek Bachchan talks about his no-intimate-scene policy
'నా కూతురు కోసం ఇకపై అలాంటి సినిమాల్లో నటించను'

By

Published : Jun 28, 2020, 12:51 PM IST

బాలీవుడ్​ ప్రముఖ నటుడు అభిషేక్ బచ్చన్.. ఆశ్చర్యకర నిర్ణయం తీసుకున్నాడు. ఇకపై రొమాంటిక్ సన్నివేశాలు , ఇలాంటి కథలతో తెరకెక్కే సినిమాలు చేయనని స్పష్టం చేశాడు. తమ కుమార్తె ఆరాధ్యకు నచ్చే తండ్రిలా ఉండాలని కోరుకుంటున్నట్లు చెప్పాడు. తను చూసేందుకు అసౌకర్యంగా అనిపించకూడదనే ఉద్దేశంతోనే ఇలా అనుకున్నానని చెప్పుకొచ్చాడు.

"తండ్రిగా మారిన తర్వాత సినిమాలు ఒప్పుకునేప్పుడు ఎలాంటి మార్పులు కోరుకుంటున్నారు" అని ఓ నెటిజన్​ అడగ్గా.. "ఓ విషయం అయితే మారింది. కొన్ని రకాల సినిమాలు, సన్నివేశాలతో నా కూతురును అసౌకర్యానికి గురిచేయాలనుకోవట్లేదు. ఎందుకంటే భవిష్యత్​లో నా సినిమాలు చూసి అక్కడ ఏం జరుగుతుందని తను, నన్ను ప్రశ్నించేలా చేయాలనుకోవడం లేదు" అని సమాధానమిచ్చాడు అభిషేక్​. ఇకపై రొమాంటిక్​ సన్నివేశాలకు చాలా దూరంగా ఉంటానని.. సినిమాలో అలాంటి సీన్స్​ లేవని చెప్పినప్పుడే ప్రాజెక్టును అంగీకరిస్తానని స్పష్టం చేశాడు​.

డిజిటల్​ అరంగేట్రం

రొమాంటిక్ సీన్స్​లో నటించనని చెప్పడం వల్ల చాలా అవకాశాలను కోల్పోయినట్లు అభిషేక్ స్పష్టం చేశాడు. బాలీవుడ్​లో ఇతడు అడుగుపెట్టి త్వరలో 20 ఏళ్లు పూర్తికానుంది. ఈ నేపథ్యంలో డిజిటల్​ తెరపై 'బ్రీత్​' అనే వెబ్​సిరీస్​తో ఎంట్రీ ఇస్తున్నాడు. అజయ్​ దేవగణ్​ దీనికి నిర్మాత. 1992లో భారతదేశంలో జరిగిన అతిపెద్ద సెక్యూరిటీ స్కామ్​ కథాంశంతో దీనిని తెరకెక్కిస్తున్నారు.

ఇదీ చూడండి... అందం తరగని అమ్మలు.. ఆరోగ్యం పెంచుకున్న భామలు!

ABOUT THE AUTHOR

...view details