తెలంగాణ

telangana

ETV Bharat / sitara

పేరు మార్చుకున్న అభిషేక్​ బచ్చన్​! - Abhishek Bachchan changes his name

బాలీవుడ్​ నటుడు అభిషేక్​ బచ్చన్​ తన పేరును అభిషేక్​ ఏ బచ్చన్​గా మార్చుకున్నట్లు సమాచారం. త్వరలో రాబోయే తన కొత్త సినిమా టైటిల్​ కార్డుపై ఈ పేరును ప్రచురించే అవకాశముంది.

abhishek
అభిషేక్​

By

Published : Feb 27, 2021, 11:10 AM IST

Updated : Feb 27, 2021, 11:22 AM IST

చిత్రసీమలో అందం, ప్రతిభ ఉంటేనే సరిపోదు అదృష్టం కూడా కలిసి రావాలి అంటుంటారు. అందుకే చాలా మంది సెలబ్రిటీలు తమ పేరులో మార్పులు లేదా ఏకంగా పేరునే మార్చుకోవడం చేస్తుంటారు. తాజాగా ఈ జాబితాలోకి బాలీవుడ్​ దిగ్గజ నటుడు అమితాబ్​ బచ్చన్​ తనయుడు అభిషేక్​ బచ్చన్ చేరారని తెలిసింది. తన పేరును 'అభిషేక్​ ఏ బచ్చన్'​గా మార్చుకున్నట్లు సమాచారం.

అభిషేక్​ బచ్చన్​ ​కెరీర్​ కొన్నాళ్ల నుంచి ఒడుదొడుకులతో సాగుతోంది. ఈ నేపథ్యంలో ప్రముఖ న్యూమరాలజిస్ట్​ సంజయ్​ బీ జుమానీ సూచన మేరకు అభిషేక్​ తన పేరును మార్చుకున్నారట. అయితే దీనిపై ఆయన నుంచి ఎటువంటి అధికారిక ప్రకటన రాలేదు. ప్రస్తుతం అభిషేక్​.. దాస్వీ దర్శకత్వంలో ఓ కొత్త సినిమా చేస్తున్నారు. ఈ సినిమా టైటిల్​ కార్డుపై ​ఈ కొత్త పేరును ప్రచురించే అవకాశముంది.

ఇదీ చూడండి:అవకాశం కోసం పోరాటం నుంచి స్టార్​డమ్ వరకు

Last Updated : Feb 27, 2021, 11:22 AM IST

ABOUT THE AUTHOR

...view details