తెలంగాణ

telangana

By

Published : Nov 26, 2020, 3:13 PM IST

Updated : Nov 26, 2020, 5:06 PM IST

ETV Bharat / sitara

గుర్తుపట్టలేని విధంగా మారిన అభిషేక్ బచ్చన్

'బాబ్ విశ్వాస్' సినిమా కోసం విభిన్న గెటప్​లో కనిపించనున్నారు అభిషేక్ బచ్చన్. ఆ ఫొటోలు కొన్ని లీక్​ కావడం వల్ల అభిషేక్​ లుక్​ బయటకొచ్చింది. ఇటీవలే 'లూడో' చిత్రంతో వచ్చిన ఈ నటుడు.. ఆకట్టుకున్నాడు.

Abhishek Bachchan is unrecognisable as he transforms into Bob Biswas
గుర్తుపట్టలేని విధంగా మారిన అభిషేక్ బచ్చన్

ప్రముఖ నటుడు అభిషేక్​ బచ్చన్ గుర్తుపట్టలేనంతగా మారిపోయి కోల్​కతా రోడ్లపై కనిపించారు. కొత్త సినిమాలోని టైటిల్​ రోల్ కాంట్రాక్ట్ కిల్లర్​ 'బాబ్ విశ్వాస్' పాత్రలో పరకాయ ప్రవేశం చేసినట్లు తెలుస్తోంది. ఈ ఫొటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్​గా మారాయి.

బాబ్ విశ్వాస్ పాత్రలో అభిషేక్ బచ్చన్
బాబ్ విశ్వాస్ పాత్రలో అభిషేక్ బచ్చన్

ఇతడితో పాటు నటి చిత్రాంగద సింగ్ కూడా చీరకట్టులో దర్శనమిచ్చింది. ఈ సినిమాను రెడ్ చిల్లీస్ ఎంటర్​టైన్​మెంట్ పతాకంపై షారుక్ ఖాన్ నిర్మిస్తుండగా, దియా అన్నపూర్ణ ఘోష్ దర్శకత్వం వహిస్తున్నారు.

ఈ జనవరిలో మొదలైైన షూటింగ్.. కరోనా ప్రభావంతో మార్చిలోనే నిలిచిపోయింది. దాదాపు 8 నెలల విరామం తర్వాత తిరిగి ఈ మధ్యనే కోల్​కతాలో ప్రారంభమైంది.

Last Updated : Nov 26, 2020, 5:06 PM IST

ABOUT THE AUTHOR

...view details