ప్రముఖ కథానాయకుడు అభిషేక్ బచ్చన్ షూటింగ్లో గాయపడ్డారు! ఓ సినిమా షూటింగ్లో భాగంగా చెన్నైలో ఉన్న ఆయన.. ఆదివారం రాత్రి పట్టుతప్పి పడిపోయారు. దీంతో కుడిచేతికి చిన్న చిన్న దెబ్బలు తగిలాయి. కొన్నిరోజులు విశ్రాంతి తీసుకుంటే సరిపోతుందని వైద్యలు సూచించారు.
Abhishek Bachchan: షూటింగ్లో గాయపడ్డ హీరో అభిషేక్ బచ్చన్! - ఒత్తు సెరప్పు సైజు 7 బండ్లగణేశ్
తమిళ సినిమా రీమేక్ చిత్రీకరణలో పాల్గొంటున్న హీరో అభిషేక్ బచ్చన్(abhishek bachchan) గాయపడ్డారు. ఆయనకు ఎలాంటి ప్రమాదం లేకపోవడం వల్ల అందరూ ఊపిరిపీల్చుకున్నారు.
అభిషేక్ బచ్చన్
తమిళంలో ప్రేక్షకాదరణ పొందిన 'ఒత్తు సెరప్పు సైజు 7'కి(oththa seruppu size 7) రీమేక్‌గా ఈ సినిమా తెరకెక్కిస్తున్నారు. ఈ చిత్రం మొత్తం ఒకే పాత్ర ఉంటుంది. ఒరిజినల్లో పార్థిబన్ నటించగా, ఇప్పుడు హిందీలో అభిషేక్ నటిస్తున్నారు. తెలుగులోనూ ఈ సినిమాను రీమేక్ చేస్తుండగా, బండ్ల గణేశ్(bandla ganesh) టైటిల్ రోల్ చేస్తున్నారు.
ఇవీ చదవండి:
Last Updated : Aug 23, 2021, 11:40 AM IST