తెలంగాణ

telangana

ETV Bharat / sitara

అభిషేక్ సన్నాఫ్ అమితాబ్.. కేరాఫ్ బచ్చన్ ​ - అభిషేక్​ బచ్చన్​ కుటుంబం

తండ్రి.. సూపర్‌ స్టార్లు మెచ్చేటువంటి అమితాబ్ బచ్చన్. తల్లి.. తన నటనతో ఆకట్టుకున్న అలనాటి మేటి నటి జయ బచ్చన్​. జీవితాన్ని పంచుకున్న భార్య తన నటనతో హాలీవుడ్‌ రేంజ్‌లో ప్రేక్షాభిమానాన్ని అందుకున్న మాజీ విశ్వసుందరి. తన కుటుంబంలో ఎంతమంది సినీ పరిశ్రమలో తమకు తాము తిరుగులేని స్టార్‌ హోదా సంపాదించుకున్నా.. వాటితో సంబంధం లేకుండా తనదైన శైలిలో సినిమాల్లో నటిస్తూ తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు దక్కించుకున్న హీరో అభిషేక్‌ బచ్చన్‌. సినీ పరిశ్రమతో విడదీయని బంధం ఏర్పరుచుకున్న బచ్చన్ కుటుంబానికి చెందిన అభిషేక్​ బచ్చన్​ పుట్టినరోజు నేడు (ఫిబ్రవరి 5న).

Abhishek Bachchan (born 5 February 1976) is an Indian film actor and film producer known for his work in Bollywood. Part of the Bachchan family
బాలీవుడ్​ సూపర్ హీరో అభిషేక్​ బచ్చన్ ప్రస్థానం ​

By

Published : Feb 5, 2020, 5:45 AM IST

Updated : Feb 29, 2020, 5:42 AM IST

బచ్చన్‌ వారసుడు

అభిషేక్‌ బచ్చన్‌ ముంబయిలో 1976 ఫిబ్రవరి 5న అమితాబ్‌ బచ్చన్, జయ బచ్చన్‌లకు జన్మించాడు. అభిషేక్‌కు శ్వేతా అనే సోదరి ఉంది. తండ్రి తరపు తాతగారు హరివంశ్‌ రాయ్‌ బచ్చన్‌ ఉర్దూ, హిందీ సాహిత్యాల్లో ప్రసిద్ధ కవి. ఉత్తరప్రదేశ్​లోని అలాహాబాద్‌ యూనివర్సిటీలో ప్రొఫెసర్‌గానూ పనిచేశారు. అభిషేక్‌ నానమ్మ తేజి బచ్చన్‌ ఓ సామాజిక కార్యకర్త. వాస్తవానికి అభిషేక్‌ బచ్చన్‌ ఇంటి పేరు శ్రీవాస్తవ. హరివంశ్‌ రాయ్‌ బచ్చన్‌ కలం పేరు బచ్చన్‌. అమితాబ్‌ 'బచ్చన్‌' పేరుతో సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చారు. అభిషేక్‌ బచ్చన్‌ తాతయ్య (తల్లి తరుపు) పేరు తరూన్‌ కుమార్‌ బడూరి. ఈయన ప్రసిద్ధ రచయిత, కవి. అభిషేక్‌ బచ్చన్‌ పాఠశాల విద్యాభ్యాసం ముంబయి, దిల్లీల్లో జరిగింది. తర్వాత స్విట్జర్లాండ్​లో ఎగ్లో కళాశాలలో చేరాడు. యునైటెడ్‌ స్టేట్స్‌లో బిజినెస్‌ మానేజ్మెంట్‌ కోర్స్‌ చేయాలని ఆకాక్షించిన అభిషేక్‌ మధ్యలో మనసు మార్చుకొని బాలీవుడ్‌ కలను సాకారం చేసుకునేందుకు ముంబయి తిరిగి వచ్చేశాడు.

బాలీవుడ్​ సూపర్ హీరో అభిషేక్​ బచ్చన్ ప్రస్థానం ​

ముద్దు పేర్లెన్నో!

అభిషేక్‌ బచ్చన్‌కి ముద్దుపేర్లు చాలానే ఉన్నాయి. బేబీ బీ, జూనియర్‌ బీ, ఏబీ, జూనియర్, అభి, ఏబీ బేబీ.. ఇలా ఆత్మీయులు ఆయన్ను పిలుచుకుంటారు.

'రెఫ్యూజీ'తో తెరంగేట్రం

2000లో జేపీ.దత్త దర్శకత్వ, నిర్మాణంలో తెరకెక్కిన 'రెఫ్యూజీ' సినిమాతో సినీపరిశ్రమలోకి అడుగుపెట్టాడు అభిషేక్​. ఈ చిత్రంతోనే కరీనా కపూర్‌ కూడా సినీ ప్రవేశం చేసింది. బాక్సాఫీసు వద్ద ఈ చిత్రం మోస్తారుగా ఆడినా.. అభిషేక్‌ బచ్చన్, కరీనా కపూర్‌ నటనాపరంగా మంచి పేరు సంపాదించుకోగలిగారు.

ధూమ్ ధూమ్

2004లో 'ధూమ్‌' చిత్రంలో పోలీస్‌ అధికారి పాత్ర పోషించాడు అభిషేక్. ఇందులో ఉదయ్‌ చోప్రా, జాన్‌ అబ్రహం, ఈషా డియోల్, రిమి సేన్‌లు కూడా ముఖ్య పాత్రల్లో నటించారు. అదే ఏడాది 'ఫిర్‌ మిలేంగే', 'నాచ్‌' చిత్రాలతో ప్రేక్షకులను పలకరించాడు. 2005లో విడుదలైన అభిషేక్‌ మొదటి సినిమా 'బంటీ ఔర్‌ బబ్లీ'. ఇందులో రాణి ముఖర్జీ హీరోయిన్‌గా నటించింది. ఈ చిత్రంలో మొదటిసారి తన తండ్రి అమితాబ్‌ బచ్చన్‌తో కలిసి తెరను పంచుకొన్నాడు జూనియర్ బచ్చన్. రామ్‌ గోపాల్‌ వర్మ దర్శకత్వంలో తెరకెక్కిన 'సర్కార్‌' సినిమాలోనూ నటించాడు. ఇందులో అమితాబ్‌ బచ్చన్‌ కూడా నటించారు. అమితాబ్‌ బచ్చన్, అభిషేక్‌ బచ్చన్‌ ఈ సినిమాలో తండ్రీ కొడుకులుగా కనిపిస్తారు. 2006లో 'కభీ అల్విదా నా కహెనా' సినిమా ద్వారా ప్రేక్షకులని పలకరించాడు అభిషేక్‌. వైవాహిక అవిశ్వాసం అనే వివాదాస్పద అంశంతో తెరకెక్కినప్పటికీ ఈ సినిమా మోస్తరుగా విజయాన్ని అందుకొంది. ఆ తర్వాత ఐశ్వర్యారాయ్‌తో 'ఉమ్రావ్‌ జాన్‌' సినిమాలో నటించాడు అభిషేక్‌. 2006లో 'ధూమ్‌ 2'తో సందడి చేశాడు.

మణిరత్నం 'గురు'

మణిరత్నం దర్శకత్వం వహించిన 2007నాటి 'గురు' చిత్రంలోని నటనకు అభిషేక్‌ బచ్చన్‌కు ఎన్నో ప్రశంసలు లభించాయి. ఈ సినిమా బిజినెస్‌ మాగ్నెట్‌ ధీరుభాయి అంబానీ జీవితం ఆధారంగా తెరకెక్కించిన పాక్షిక బయోపిక్‌ అని సినిమా విశ్లేషకులు భావిస్తారు. వివాహం అయిన తర్వాత మొదటిసారి ఐశ్వర్యారాయ్, అభిషేక్‌ బచ్చన్‌ కలిసి నటించిన సినిమా ఇదే. 2007నాటి సినిమా 'ఝూమ్‌ బరబరా ఝూమ్‌' సినిమాలో ప్రీతీ జింటా, బాబీ డియోల్, లారాదత్తాలతో కలిసి నటించాడు అభిషేక్‌ బచ్చన్‌. 2008లో రామ్‌ గోపాల్‌ వర్మ తెరకెక్కించిన 'సర్కార్‌ రాజ్‌' చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. 2008లో 'దోస్తానా' సినిమాతోనూ ప్రేక్షకులను పలకరించాడు. ఇందులో అభిషేక్‌తో పాటు జాన్‌ అబ్రహం, ప్రియాంకా చోప్రాలు కూడా ముఖ్య పాత్రలు పోషించారు. బాక్సాఫీస్ వద్ద పెద్ద విజయం సాధించిన ఈ సినిమాతో ఈసారి ఉత్తమ నటుడిగా ఫిల్మ్​ఫేర్​ పురస్కారానికి నామినేట్‌ అయ్యాడు. 2009లో విడుదలయిన అభిషేక్‌ బచ్చన్‌ మొదటి సినిమా 'దిల్లీ 6'. అంతకుముందు 'లక్‌ బై ఛాన్స్‌'లో నటించినా అందులో అతిథి పాత్రలోనే కనిపించాడు. 'దిల్లీ 6' తర్వాత 'పా' చిత్రంలో నటించాడు. ఈ సినిమాకు అభిషేక్‌ బచ్చనే నిర్మాత. ఇందులో విద్యాబాలన్‌ హీరోయిన్‌గా నటించగా అమితాబ్‌ బచ్చన్‌ ఓ ప్రముఖ పాత్రలో కనిపిస్తారు. 2013లో 'ధూమ్‌ 3'లో, 2014లో ఫరాఖాన్‌ దర్శకత్వం వహించిన 'హ్యాపీ న్యూ ఇయర్‌' సినిమాలో, 2015లో ఫామిలీ డ్రామాగా తెరకెక్కిన 'ఆల్‌ ఈజ్‌ వెల్‌' సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చాడు.

రెండేళ్ల విరామం తరువాత..

దాదాపు రెండేళ్ల విరామం తీసుకొన్న తర్వాత అనురాగ్‌ కశ్యప్‌ దర్శకత్వం వహించిన 'మన్మర్జియా' సినిమాలో నటించాడు అభిషేక్‌ బచ్చన్‌. తాప్సీ హీరోయిన్‌గా నటించిన ఈ సినిమా సెప్టెంబర్‌ 2018లో విడుదలైంది. బాక్సాఫీసు వద్ద విజయం అందుకొంది. 2019 సెప్టెంబర్‌లో, 'ద బిగ్‌ బుల్‌' అనే సినిమా చిత్రీకరణ ప్రారంభించాడు అభిషేక్‌. రెడ్‌ చిల్లీస్‌ ఎంటర్​టైన్​మెంట్ నిర్మాణం వారి 'బాబ్‌ బిశ్వాస్‌' సినిమాలో కూడా ప్రేక్షకులు అభిషేక్‌ బచ్చన్‌ను చూడనున్నారు. ఈ ఏడాదే ఈ సినిమా చిత్రీకరణ ప్రారంభం అవుతుంది. అలాగే 'లూడో' సినిమాలో కూడా అభిషేక్‌ నటిస్తున్నాడు. ఇది ఈ ఏడాది ఏప్రిల్‌లో విడుదల కానుంది.

బాలీవుడ్​ సూపర్ హీరో అభిషేక్​ బచ్చన్ ప్రస్థానం ​

ఐశ్వర్యతో వివాహం-కథాకమామిషు

2002 అక్టోబర్‌లో తండ్రి అమితాబ్‌ బచ్చన్‌ 60వ పుట్టినరోజు వేడుకల్లో అభిషేక్‌ బచ్చన్, కరిష్మా కపూర్​ల నిశ్చితార్ధపు ప్రకటన వచ్చింది. జనవరి 2003లో ఈ నిశ్చితార్ధం రద్దయింది. 'ధూమ్‌ 2' సినిమా చిత్రీకరణ సమయంలో ఐశ్వర్యా రాయ్‌తో అభిషేక్‌ బచ్చన్‌ ప్రేమలో పడ్డాడట. వాస్తవానికి అభిషేక్‌ బచ్చన్, ఐశ్వర్యా రాయ్‌లు కలిసి 2000వ సంవత్సరంలో 'దాయి అక్షర్‌ ప్రేమ్‌ కె' సినిమాలో నటించారు. అలాగే 'కుచ్‌ నా కహో'లో కూడా కలిసి పనిచేశారు. ఐశ్వర్య రాయ్, అభిషేక్‌ బచ్చన్‌ వారి నిశ్చితార్ధం గురించి 2007 జనవరి 14న ప్రకటించగా.. ఆ తరువాత అమితాబ్‌ బచ్చన్‌ ఈ విషయాన్ని ధ్రువీకరించారు. 2007 ఏప్రిల్‌ 20న వీరి వివాహం జరిగింది. ముంబైలోని జుహు ప్రాంతంలో అమితాబ్‌ బచ్చన్‌ ఇంటి దగ్గరే హిందూ సాంప్రదాయ ప్రకారం వీరి వివాహం అంగరంగ వైభవంగా జరిగింది. 2011 నవంబర్‌ 16న ఆరాధ్యకు జన్మనిచ్చింది ఐశ్వర్య.

ఇదీ చదవండి: పవన్​తో సినిమాపై స్పందించిన హరీశ్​ శంకర్​

Last Updated : Feb 29, 2020, 5:42 AM IST

ABOUT THE AUTHOR

...view details