తెలంగాణ

telangana

ETV Bharat / sitara

అవకాశం కోసం పోరాటం నుంచి స్టార్​డమ్ వరకు - amitabh with abhishek

కథానాయకుడు, బిగ్ బీ కుమారుడు అభిషేక్.. 46వ వసంతంలోకి అడుగుపెట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడిన కొన్ని విషయాలు మీకోసం.

abhishek bachchan birthday story
అవకాశం కోసం పోరాటం నుంచి స్టార్​డమ్ వరకు

By

Published : Feb 5, 2021, 5:30 AM IST

మెగాస్టార్ అమితాబ్‌ వారసుడిగా అభిషేక్‌ బచ్చన్‌ బాలీవుడ్‌లోకి అడుగుపెట్టారు. అయితే బిగ్‌బీ స్థాయిలో ఫేమ్ రాకపోయినా తనదైన శైలిలో రాణిస్తున్నారు. అభిషేక్ పుట్టినరోజు సందర్భంగా ఆయన గతంలో చెప్పిన కొన్ని ఆసక్తికర విషయాల్ని మరోసారి గుర్తు చేసుకుందాం.

తండ్రి అమితాబ్​తో అభిషేక్

"బిగ్‌బీ వారసుడిగా ఇండస్ట్రీలోకి వచ్చిన నేను కెరీర్‌ ప్రారంభంలో చేసిన చిత్రాలు అంతగా పేరు తెచ్చిపెట్టలేదు. కానీ 'ధూమ్‌' చిత్రం నాకు స్టార్‌డమ్‌ను తెచ్చిపెట్టింది. అందరూ నా నటనను బాగా ప్రశంసించారు. ఆటోగ్రాఫ్‌లు, ఫొటోగ్రాఫ్‌లు తీసుకునేవారు. దాంతో నేను గాల్లో తేలిపోయాను. చిత్రం విజయోత్సవ సంబరాలను మా ఇంటికి సమీపంలోని ఒక హోటల్‌లో జరిపారు. అక్కడినుంచి తిరిగి వస్తున్న సమయంలో నేను చాలా గర్వంగా ఫీలయ్యాను. నేను పెద్ద స్టార్‌ అన్న భావన కలిగింది. అలా ఇంటికి వెళ్లి డోర్‌బెల్‌ కొట్టగానే మా తండ్రి(బిగ్‌బీ) తలుపు తెరిచారు. ఆయన్ను చూడగానే ఒక్కసారే నా గర్వం అంతా మాయమైపోయింది. నా తండ్రి సాధించిన దానిలో నేను ఇసుమంతైనా సాధించలేదని అర్థం అయ్యింది. నేను చాలా కృషి చేయాల్సి ఉందని అప్పుడు అనుకున్నాను" అని అభిషేక్ చెప్పారు.

తాను కెరీర్‌లో ఎదగడం కోసం అమితాబ్‌ ఏ రోజూ సాయం చేయలేదని, డబ్బులు పెట్టలేదని అభిషేక్ స్పష్టం చేశారు. నాన్న నటించిన 'పా' చిత్రాన్ని తానే నిర్మించినట్లు చెప్పారు. 'నాన్న ఎవరి ఫోన్‌కాల్స్‌ను లిఫ్ట్‌ చేయరు. నా కోసం ఎప్పుడూ సినిమాను నిర్మించలేదు. కానీ నేను ఆయన కోసం 'పా' సినిమాను నిర్మించాను' అని అభిషేక్ పేర్కొన్నారు. ఈ సినిమాలో బిగ్​బీ జన్యుపరమైన లోపం ఉన్న అబ్బాయిగా కనిపించారు. అభిషేక్‌ ఆయన తండ్రి పాత్రను, విద్య తల్లి పాత్రను పోషించారు.

పా సినిమాలో అమితాబ్ అభిషేక్

"నా తండ్రే నాకు మంచి స్నేహితుడు. మేం ప్రతి విషయం గురించి చర్చించుకుంటాం. ఒకరి ఆలోచనలను మరొకరితో పంచుకుంటాం. మా నాన్న సూపర్‌ స్టార్‌ కావడం వల్ల నాకు సినీరంగ ప్రవేశం సులభంగా లభించిందని అందరూ అనుకుంటారు. నా మొదటి సినిమా రెఫ్యూజీలో అవకాశం చేజిక్కించుకోవడానికి పోరాటం చేయవలసి వచ్చింది ఏదీ సులభంగా రాదు. ఏదైతే కావాలనుకుంటామోదాని కోసం పోరాటం చేయవలసి ఉంటుంది"అని అభిషేక్ అన్నారు.

ప్రస్తుతం అభిషేక్‌ 'బిగ్‌బుల్‌' సినిమాలో స్టాక్‌ మార్కెట్‌ సంచలనం హర్షద్‌ మెహతా పాత్రలో నటిస్తున్నారు. అలాగే 'బాబ్‌ విశ్వాస్‌' చిత్రమూ చేస్తున్నారు.

భార్య ఐశ్వర్య రాయ్​తో అభిషేక్ బచ్చన్

ABOUT THE AUTHOR

...view details