తెలంగాణ

telangana

ETV Bharat / sitara

స్టార్ హీరో ఫోన్ చోరీ చేసిన ప్రియాంక.. వేరే హీరోయిన్​కు ఆ మెసేజ్ - ప్రియాంక చోప్రా అభిషేక్​ బచ్చన్​

Priyanka Chopra Abhishek Bachan: ప్రముఖ కథానాయిక ప్రియాంక చోప్రా.. హీరో అభిషేక్ బచ్చన్ ఫోన్ దొంగతనం చేసింది. అంతే కాకుండా ఆ చరవాణి నుంచి వేరే హీరోయిన్​కు 'ఐ మిస్ యూ' అంటూ మెసేజ్​ కూడా పెట్టింది. ఇంతకీ ఇది ఎప్పుడు? ఎక్కడ జరిగిందంటే?

priyanka chopra
ప్రియాంక చోప్రా

By

Published : Feb 28, 2022, 10:26 AM IST

Updated : Feb 28, 2022, 1:06 PM IST

Priyanka Chopra Abhishek Bachan: గ్లోబల్​ స్టార్ ప్రియాంక చోప్రా.. స్టార్ హీరో అభిషేక్​ బచ్చన్ ఫోన్​ను దొంగిలించింది. ఆ తర్వాత దాని నుంచి వేరే హీరోయిన్​కు 'ఐ మిస్ యూ' అంటూ మెసేజ్​ పెట్టింది. ఈ ఆసక్తికర విషయాన్ని స్వయంగా ప్రియాంక చోప్రానే వెల్లడించింది. ఇందుకు సంబంధించిన పాత వీడియోను సీనియర్ నటి సిమి గెర్వాల్​ షేర్ చేసింది.

ఇంతకీ ఏం జరిగింది?

నటి సిమి.. గతంలో 'రెజెన్​డెజ్వస్ విత్ సిమి గెర్వాల్' అనే టాక్ షోకు హోస్ట్​గా వ్యవహరించింది. ఐదు సీజన్ల పాటు సాగిన ఈ కార్యక్రమానికి చాలామంది బాలీవుడ్​ సెలబ్రిటీలు హాజరై, తమ కెరీర్​లో జరిగిన ఆసక్తికర విషయాల్ని వెల్లడించారు. అలా ఓసారి ఆ కార్యక్రమానికి వచ్చిన ప్రియాంక చోప్రా కూడా సినిమా షూటింగ్​లో అభిషేక్​తో జరిగిన్న ఫన్నీ సంఘటన గురించి చెప్పింది.

అభిషేక్​ ఫోన్ నువ్వు దొంగిలించావా? అని సిమి, ప్రియాంకను అడగ్గా.. 'తనే నా ఫోన్ ముందు దొంగిలించాడు. దానిపై కూర్చుని ఉండిపోయాడు. అయితే దానిపై ఎక్కువసేపు ఉండలేదు కదా. అందుకే లేచి అక్కడ నుంచి వెళ్లిపోయాడు' అని ప్రియాంక చెప్పింది.

'ఆ తర్వాత అభిషేక్​ ఫోన్ దొంగిలించి నేను ఓ చోట దాచేశాను. ఓ హీరోయిన్​కు 'ఐ మిస్ యూ. ఎక్కడున్నావ్? నేను నీతో..' అంటూ మెసేజ్ పెట్టాను.' అంటూ సిమికి చెబుతూనే ప్రియాంక పగలబడి నవ్వింది. వీడియోలో ఇది స్పష్టంగా కనిపించింది.

ఆ హీరోయిన్​ రాణి ముఖర్జీ అంటూ సిమి అసలు విషయం చెప్పింది. ఆ తర్వాత రాణి నుంచి అభిషేక్​కు వచ్చిన మెసేజ్​ను రాణిలా మిమిక్రీ చేస్తూ ప్రియాంక చెప్పింది.

అభిషేక్-ప్రియాంక కలిసి.. 'ద్రోణ', 'బ్లఫ్​ మాస్టర్', 'దోస్తానా' సినిమాల్లో కలిసి నటించారు. ప్రస్తుతం అభిషేక్​.. సినిమాలతో పాటు వెబ్ సిరీస్​లు చేస్తున్నారు. ప్రియాంక్.. బాలీవుడ్​తో పాటు హాలీవుడ్​ సినిమాల్లోనూ నటిస్తోంది.

ఇదీ చూడండి: గోల్డెన్​ చీరలో సాయిపల్లవి.. ప్రగ్యా జైస్వాల్​ సోకుల విందు!

Last Updated : Feb 28, 2022, 1:06 PM IST

ABOUT THE AUTHOR

...view details