తెలంగాణ

telangana

ETV Bharat / sitara

'బచ్చన్‌ పాండే'లో గబ్బర్​సింగ్​ విలన్​ - అభిమన్యు సింగ్​ బచ్చన్​ పాండే సినిమా

అక్షయ్​ కుమార్​ నటిస్తోన్న 'బచ్చన్‌ పాండే' సినిమాలో విలన్​గా అభిమన్యు సింగ్‌ కనిపించనున్నారు. ఈ విషయాన్ని ప్రముఖ సినీ విశ్లేషకుడు తరణ్​ ఆదర్శ్ ట్వీట్​ చేశారు. ప్రస్తుతం చిత్రీకరణ జరుపుకుంటోందీ చిత్రం.

akshay kumar
అక్షయ్​ కుమార్​

By

Published : Jan 30, 2021, 4:44 PM IST

అక్షయ్‌ కుమార్‌ ప్రధాన పాత్రలో నటిస్తున్న చిత్రం 'బచ్చన్‌ పాండే'. ఫర్హాద్‌ సమ్జీ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో ప్రతినాయకుడిగా అభిమన్యు సింగ్‌ నటిస్తున్నారు. ప్రముఖ సినీ విశ్లేషకుడు తరణ్​ ఆదర్శ్ ఈ విషయాన్ని ట్వీట్​ చేశారు. ఇటీవలే సినిమా షూటింగ్‌ జైసల్మేర్‌లో ప్రారంభమైంది.

అభిమన్యు దక్షిణాది చిత్రాల్లోనూ ప్రతినాయకుడిగా నటించి అలరించారు. జాక్విలిన్ ఫెర్నాండెజ్, కృతి సనన్‌, అర్షద్ వార్సీ పలు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఈ చిత్రం జనవరి 26, 2022 న విడుదల కానుంది. ఇక అభిమన్యు సింగ్‌ బాలీవుడ్‌లో 'గోలియాన్‌ కి రాస్‌లీలా రామ్ లీలా', 'రక్తచరిత్ర', 'లక్ష్య', 'మామ్'‌ చిత్రాల్లోనూ పనిచేశారు. అక్షయ్‌ కుమార్‌తో కలిసి 'వన్స్ అపాన్‌ ఏ టైమ్‌ ఇన్‌ ముంబై దొబారా', 'సూర్యవన్షి'ల్లో నటించారు. ప్రస్తుతం 'ద బ్యాటిల్‌ ఆఫ్‌ భీమా కోరెగావ్' చిత్రంలో పనిచేస్తున్నారు.

ట్వీట్​

ఇదీ చూడండి : తేదీల్ని ఫిక్స్ చేసిన అక్షయ్ కుమార్, శర్వానంద్

ABOUT THE AUTHOR

...view details