తెలంగాణ

telangana

ETV Bharat / sitara

ఆర్ఆర్ఆర్​లో అజయ్ దేవ్​గన్..? - ram charan

జక్కన్న రాజమౌళి దర్శకత్వంలో రామ్ చరణ్, ఎన్టీఆర్ కథానాయకులుగా తెరకెక్కుతున్న ఆర్ఆర్ఆర్ సినిమాలో బాలీవుడ్ నటుడు అజయ్ దేవ్​గన్ అతిథి పాత్ర..

ఆర్ఆర్ఆర్​లో అజయ్ దేవ్​గన్

By

Published : Feb 11, 2019, 9:23 PM IST

దర్శక ధీరుడు రాజమౌళి దర్శకత్వంలో రూపొందుతున్న ఆర్ఆర్ఆర్​లో బాలీవుడ్ నటుడు అజయ్ దేవ్​గన్ అతిథి పాత్రలో నటిస్తున్నట్లు సమాచారం. 'తానాజీ' షూటింగ్ పూర్తైన తర్వాత ఈ సినిమా చిత్రీకరణలో పాల్గొంటాడని తెలుస్తోంది. ఇంతకుముందు జక్కన్న 'ఈగ' హిందీ అనువాదం 'మక్కీ'కి వాయిస్ ఓవర్ ఇచ్చారు అజయ్.

రామ్ చరణ్, ఎన్టీఆర్ ప్రధాన పాత్రలు పోషిస్తున్న ఈ చిత్రం దాదాపు 300 కోట్ల బడ్జెట్​తో తెరకెక్కుతోంది. శంకర్, కమల్ హాసన్ కలయికలో వస్తున్న భారతీయుడు 2లో ప్రతినాయకుడి పాత్రలో నటించాలని చిత్రబృందం కోరినా అంగీకరించని అజయ్ దేవ్​గన్ జక్కన్న చిత్రానికి గ్రీన్ సిగ్నల్ ఇవ్వటం చర్చనీయాంశమైంది.

ABOUT THE AUTHOR

...view details