తెలంగాణ

telangana

ETV Bharat / sitara

ఆమిర్​ఖాన్​ కూతురు ఐరా డేటింగ్​. ఎవరితో? - aamir khan

సూపర్​స్టార్ ఆమిర్ ఖాన్ కూతురు ఐరా ఖాన్, మ్యూజిక్ కంపోజర్​ మిషాల్​తో డేటింగ్​లో ఉన్నట్లు తెలిపింది. సంబంధిత ఫొటోల్ని ఇన్​స్టాలో పంచుకుంది.

డేటింగ్​లో ఉన్న సూపర్​స్టార్ కూతురు

By

Published : Jun 13, 2019, 5:01 PM IST

బాలీవుడ్​ హీరో ఆమిర్ ఖాన్ కూతురు ఐరా ఖాన్ డేటింగ్​లో ఉంది. గత కొద్ది రోజులుగా నెట్టింట చక్కర్లు కొడుతున్న వార్త ఇది. సంగీతకారుడు మిషాల్ కృపలానితో డేటింగ్​లో ఉన్నట్లు ఆమె ఇన్​స్టాగ్రామ్​ పోస్టులు చూస్తే అర్ధమవుతుంది. సామాజిక మాధ్యమాల్లో వీరిద్దరి ఖాతాలు చూస్తే ఇదే నిజమేనని అనిపిస్తుంది. కౌగిలించుకున్నట్లు, నుదుటపైనా ముద్దుల పెడుతున్నట్లు ఫొటోలు నెటిజన్లను ఆకర్షిస్తున్నాయి.

నటుడు, కంపోజర్, నిర్మాత అయిన మిషాల్ కృపలాని.. ఐరా ఖాన్​తో ఉన్న ఫొటోల్ని సామాజిక మాధ్యమాల్లో పంచుకున్నాడు. ఒక పోస్టులో ఆమెను 'ఛార్మర్' అంటూ సంబోధించాడు.

మిషాల్​తో రిలేషన్​షిప్​పై ఇన్​స్టాలో ఐరాను ఓ అభిమాని అడిగిన ప్రశ్నకు సమాధానంగా.. అతడిని కౌగిలించుకున్న ఫొటోను పోస్టు చేసిందీ భామ.

ఆమిర్ మొదటి భార్య రీనాదత్తా చిన్న కూతురు ఐరాఖాన్. తన కూమార్తెకు దర్శకత్వం అంటే ఇష్టమని ఓ చాట్ షోలో ఆమిర్ ఖాన్ స్వయంగా​ చెప్పాడు.

ఇది చదవండి: పోరాటాల 'సాహో'- అదరగొట్టిన ప్రభాస్​

ABOUT THE AUTHOR

...view details