తెలంగాణ

telangana

ETV Bharat / sitara

కూరగాయలు అమ్ముతున్న ఆమిర్​ఖాన్ సహనటుడు - ఆమిర్​ఖాన్ తాజా వార్తలు

ప్రముఖ కథానాయకుడు ఆమిర్ ఖాన్​​తో కలిసి నటించిన జావేద్ హైదర్.. ముంబయిలో కూరగాయలు అమ్ముతూ కనిపించాడు. ఈ వీడియో ప్రస్తుతం వైరల్​గా మారింది.

కూరగాయలు అమ్ముతున్న ఆమిర్ సహనటుడు
నటుడు జావేద్ హైదర్

By

Published : Jun 29, 2020, 6:01 PM IST

Updated : Jun 30, 2020, 10:10 AM IST

బాలీవుడ్​ స్టార్ ఆమిర్​ ఖాన్​తో 'గులామ్​' సినిమాలో కలిసి నటించిన జావేద్ హైదర్.. ప్రస్తుతం ముంబయి వీధుల్లో కూరగాయలు అమ్ముకుంటున్నాడు. కరోనా ప్రభావంతో ఆర్థిక కష్టాలు రావడం వల్ల ఇతడు ఈ పనికి పూనుకున్నట్లు తెలుస్తోంది. ఇందుకు సంబంధించిన వీడియోను బిగ్​బాస్ ఫేమ్ డాలీ బింద్రా తన ట్విట్టర్​లలో పంచుకుంది.

అయితే ఈ వీడియోలో 'దునియా మైన్ రెహనా హై' అనే పాటకు లిప్​సింక్ ఇస్తూ కనిపించాడు జావేద్. దీనిపై స్పందిస్తున్న నెటిజన్లు.. అతడు చేస్తున్న పనిని మెచ్చుకుంటున్నారు. "ప్రస్తుత పరిస్థితులను అర్ధం చేసుకుని ముందుకు సాగుతున్నావ్" అని ఓ నెటిజన్ కామెంట్ చేయగా, "క్లిష్ట పరిస్థితుల్లో అతడు ఎంచుకున్న మార్గాన్ని మనం గౌరవించాలి" అని మరొకరు ప్రశంసించారు.

కొన్నిరోజుల క్రితం ఇదే తరహాలో 'డ్రీమ్​గర్ల్' నటుడు సోలాంకి దివాకర్.. దిల్లీలో పండ్లు అమ్ముతూ కనిపించాడు.

జావేద్ హైదర్.. 'గులామ్'తోపాటు బాబర్(2009), లైఫ్ కీ ఐసీ కీ తైసీ(2017) లాంటి సినిమాలు, జెన్నీ ఔర్ జుజు(2012) అనే టీవీ సిరీస్​లోనూ నటించాడు.

ఇవీ చదవండి:

Last Updated : Jun 30, 2020, 10:10 AM IST

ABOUT THE AUTHOR

...view details