తెలంగాణ

telangana

ETV Bharat / sitara

విశ్వనాథన్ ఆనంద్ బయోపిక్​లో ఆమిర్​ఖాన్! - చెస్ ఆనంద్ బయోపిక్

చెస్ దిగ్గజం ఆనంద్ బయోపిక్​లో ఆమిర్​ఖాన్ నటించే అవకాశముంది. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో నిర్మాత మహావీర్ జైన్ వ్యాఖ్యలే ఇందుకు బలం చేకూర్చుతున్నాయి. ఇందులో నిజమెంత?

Aamir Khan would be a suitable choice to play Viswanathan Anand: producer Mahaveer Jain
విశ్వనాథన్ ఆనంద్ బయోపిక్​లో ఆమిర్​ఖాన్!

By

Published : Feb 12, 2021, 7:52 AM IST

దిగ్గజ విశ్వనాథన్ ఆనంద్.. చెస్​లో ఎన్నో ఘనతల్ని సాధించి ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్నారు. రాజీవ్​గాంధీ ఖేల్​రత్న, పద్మ విభూషణ్​ అవార్డులను దక్కించుకున్నారు. అయితే ఆయన జీవితం ఆధారంగా ఓ సినిమా తీస్తున్నట్లు గతేడాది డిసెంబరులో ప్రకటించారు. అప్పటినుంచి ఆనంద్ పాత్రలో ఎవరు నటిస్తారా అని నెటిజన్లు చర్చించుకుంటున్నారు. ఈ క్రమంలోనే నిర్మాత మహావీర్ జైన్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

"ప్రధాన పాత్రధారుల గురించి ఇప్పుడే చెప్పలేం. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. అయితే ఆనంద్ పాత్రలో ఆమిర్​ఖాన్ సరిగ్గా సరిపోతాడని నా అభిప్రాయం" అని జైన్ చెప్పారు.

ప్రస్తుతం కథను డెవలప్​ చేసే పనిలో చిత్రబృందం ఉంది. త్వరలో షూటింగ్ ప్రారంభం కానుంది. మహావీర్​ జైన్​తో కలిసి ఈ సినిమా నిర్మిస్తున్న బాలీవుడ్ ప్రముఖ దర్శకుడు ఆనంద్ ఎల్.రాయ్ నిర్మాణంలో భాగమయ్యారు.

'దంగల్​'లో నిజజీవిత పాత్ర మహావీర్ సింగ్ ఫొగాట్​గా ఇప్పటికే గుర్తింపు తెచ్చుకున్న ఆమిర్.. ప్రస్తుతం 'లాల్ సింగ్ చద్దా' షూటింగ్​తో బిజీగా ఉన్నారు. టామ్ హాంక్స్ 'ఫారెస్ట్ గంప్' చిత్రానికి ఇది రీమేక్​గా తెరకెక్కుతోంది.

లాల్ సింగ్ చద్దా సినిమాలో ఆమిర్​ ఖాన్

ABOUT THE AUTHOR

...view details