తెలంగాణ

telangana

ETV Bharat / sitara

ఫోన్​ స్విచ్​ ఆఫ్​ చేసిన ఆమిర్ ఖాన్​​​​.. ఎందుకంటే? - ఆమిర్​ ఖాన్​ లాల్​ సింగ్​ చద్ధా

'లాల్​ సింగ్​ చద్దా' సినిమా కోసం హీరో ఆమిర్​ ఖాన్​ ఓ అనూహ్య నిర్ణయం తీసుకున్నారని తెలిసింది. సినిమా విడుదల అయ్యేవరకు తన ఫోన్​ స్విచ్​ ఆఫ్​లో ఉంచుతారని సమాచారం. ఎందుకంటే?

aamir
ఆమిర్​

By

Published : Feb 2, 2021, 4:49 PM IST

సినిమా కోసం నటులు ఏమైనా చేయడానికి సిద్ధపడుతుంటారు. పాత్ర డిమాండ్​ చేస్తే శరీరాకృతిని మార్చుకోవడం, గుర్రపు స్వారీలు, బైక్​ రైడింగులు, కత్తి యుద్ధాలు ఇలా రకరకాలు కళలను నేర్చుకుంటూ విన్యాసాలు చేస్తుంటారు. పాత్రలో లీనమైపోయేందుకు కుటుంబానికి దూరంగా ఉంటూ ఫోన్లను సైతం పక్కన పెట్టేస్తుంటారు. బాలీవుడ్‌ స్టార్​ ఆమిర్​ ఖాన్‌ కూడా ఇదే కోవకు చెందుతారు. తాను నటిస్తోన్న 'లాల్‌ సింగ్‌ చద్దా' సినిమా కోసం తన ఫోన్‌ స్విచ్​ ఆఫ్​ చేశారు.

సెట్​లో ఉన్నప్పుడు ఫోన్‌ వల్ల ఏకాగ్రత దెబ్బతినకూడదని ఈ నిర్ణయం తీసుకున్నారని తెలిసింది. ఏదైనా తప్పనిసరైతే తన మేనేజర్‌కు కాల్‌ చేయాలని సన్నిహితులకు చెప్పారట. దీంతో పాటు ఆమీర్​ సోషల్‌ మీడియా అకౌంట్లను కూడా అతడి టీమే చూసుకుంటోంది. ఈ ప్రక్రియను 'లాల్‌ సింగ్‌ చద్దా' సినిమా థియేటర్లలో విడుదల అయ్యేవరకు కొనసాగుతుందని తెలిసింది.

'లాల్​ సింగ్​ చద్దా' సినిమా హాలీవుడ్​ హిట్ 'ఫారెస్ట్ గంప్'కు రీమేక్. ఈ చిత్రాన్ని దర్శకుడు అద్వైత్ చందన్ తెరకెక్కిస్తున్నారు. కరీనా కపూర్ హీరోయిన్.

ఇదీ చూడండి : అమ్మాయి నో చెప్పిందని గుండు చేయించుకున్న ఆమిర్‌!

ABOUT THE AUTHOR

...view details