తెలంగాణ

telangana

ETV Bharat / sitara

బాలీవుడ్​ నటుడు ఆమిర్​ ఖాన్​కు కరోనా - ఆమిర్​ ఖాన్​ కరోనా

బాలీవుడ్ హీరో ఆమిర్​ ఖాన్​కు కరోనా పాజిటివ్​గా తేలింది. వైద్యుల సూచన మేరకు ప్రస్తుతం ఆయన స్వీయనిర్బంధంలో ఉన్నట్లు ఆమిర్​ ప్రతినిధి ఒకరు మీడియాతో వెల్లడించారు.

Aamir Khan tests postive for COVID-19
బాలీవుడ్​ నటుడు ఆమిర్​ ఖాన్​కు కరోనా

By

Published : Mar 24, 2021, 1:02 PM IST

బాలీవుడ్ కథానాయకుడు ఆమిర్​ ఖాన్​కు కరోనా పాజిటివ్​గా నిర్ధరణ అయ్యింది. ప్రస్తుతం ఆయన ఆరోగ్యం నిలకడగానే ఉండడం వల్ల స్వీయనిర్బంధంలో ఉన్నట్లు ఆమిర్​ ప్రతినిధి మీడియాతో వెల్లడించారు. గత కొన్ని రోజులుగా అతడ్ని కలిసిన వ్యక్తులు కరోనా టెస్ట్​ చేయించుకోవాల్సిందిగా ఆయన సూచించారు.

"ఆమిర్​ ఖాన్​కు కరోనా పాజిటివ్​గా తేలింది. కరోనా నిబంధనలను అనుసరించి ఆయన ప్రస్తుతం స్వీయనిర్బంధంలో ఉన్నారు. ఆమిర్​ ఆరోగ్యం నిలకడగానే ఉంది. కొన్ని రోజులుగా హీరోను కలిసిన వారు ముందు జాగ్రత్తగా కొవిడ్ టెస్ట్​ చేయించుకోవాల్సిందిగా కోరుతున్నాం" అని ఆమిర్​ ఖాన్​ ప్రతినిధి తెలిపారు.

ఆమిర్​ ఖాన్​.. ప్రస్తుతం 'లాల్​ సింగ్​ చద్దా'లో నటిస్తున్నారు. ఈ చిత్రం డిసెంబరులో విడుదలకానుంది. ఇందులో కరీనా కపూర్​ నాయికగా నటిస్తున్నారు.

ఇదీ చూడండి:బీబీ3: పవర్​ఫుల్​ రోల్​లో హీరో శ్రీకాంత్​!

ABOUT THE AUTHOR

...view details