తెలంగాణ

telangana

ETV Bharat / sitara

సాధారణ ప్రయాణికుడిలా ఆమిర్ ఖాన్ - ఆమిర్ ఖాన్

విమానంలో ఎకానమీ క్లాస్​లో ప్రయాణించి ఆశ్చర్యపరిచాడు ఆమిర్ ఖాన్. సంబంధిత వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది.

వైరల్ వీడియో: సాధారణ ప్రయాణికుడిలా ఆమిర్ ఖాన్

By

Published : Apr 24, 2019, 7:47 PM IST

సాధారణంగా సినీ నటులకు అభిమానుల బెడద ఎక్కువ. ఎక్కడికి వెళ్లినా సెల్ఫీలు అంటూ చుట్టుముట్టి ఇబ్బంది పెడుతుంటారు. అందుకనే వారు విమానాల్లో అయితే బిజినెస్ క్లాస్​లోనే వెళతారు. కానీ బాలీవుడ్ సూపర్​స్టార్ ఆమిర్ ఖాన్ మాత్రం సాధారణ ప్రయాణికుడిలా ఎకానమీ క్లాస్​లో వెళ్లారు. సదరు వీడియో సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొడుతోంది.

ఈ విషయంపై నెటిజన్లు విభిన్నంగా స్పందిస్తున్నారు. ఆమిర్ నటించిన గత చిత్రం 'థగ్స్ ఆఫ్ హిందుస్థాన్' భాక్సాఫీస్​ దగ్గర బోల్తా కొట్టింది. అందుకే ఎకానమీ క్లాస్​లో ప్రయాణిస్తున్నాడని కొందరు జోకులు పేల్చుతున్నారు.

అసలు కారణం ఇది..!
ఇటీవల ప్రఖ్యాత విమానయాన సంస్థ జెట్ ఎయిర్​వేస్.. విమాన ప్రయాణాల్ని ఆపేసింది. చాలా మంది టికెట్లు రద్దు చేసింది. చేసేదేమి లేక ఇతర సంస్థలకు చెందిన విమానాల్లో టికెట్లు బుక్ చేసుకున్నారు. అలా ఇండిగో విమానంలో ఎకానమీ క్లాస్​లో ప్రయాణించాడు ఆమిర్ ఖాన్. ఆ సమయంలో ఒక అభిమాని అతడ్ని వీడియో తీశాడు. అదే ఇప్పుడు వైరల్ అవుతోంది.

ఆమిర్ ప్రస్తుతం 'లాల్ సింగ్ చద్దా'లో నటించేందుకు సిద్ధమవుతున్నాడు. 'సీక్రెట్ సూపర్​స్టార్' చిత్రాన్ని తెరకెక్కించిన అద్వైత్ చతుర్వేది ఈ సినిమాకు దర్శకత్వం వహించనున్నాడు. హాలీవుడ్ సినిమా 'ఫారెస్ట్ గంప్​'కు ఇది రీమేక్.

ABOUT THE AUTHOR

...view details