తెలంగాణ

telangana

By

Published : Dec 8, 2019, 5:15 AM IST

ETV Bharat / sitara

'లాల్​ సింగ్​ చద్దా'లో లీకైన ఆమిర్​ఖాన్ కొత్తలుక్​

'లాల్​ సింగ్ చద్దా' సినిమాలోని సూపర్​స్టార్ ఆమిర్​ఖాన్ కొత్త లుక్​ ఒకటి లీకైంది. ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో ఇది వైరల్​గా మారింది.

లీకైన 'లాల్​ సింగ్​ చద్దా'లో ఆమిర్​ఖాన్ కొత్తలుక్​
సూపర్​స్టార్ ఆమిర్​ఖాన్

చరవాణి, ఇంటర్‌నెట్‌... ప్రస్తుతం ఇవి రెండూ మనుషుల జీవన విధానాన్ని శాసిస్తున్నాయి. మారుతున్న టెక్నాలజీతో వెండితెరపై అద్బుతాలు సృష్టిస్తున్న కొందరు దర్శకులకు.. సినిమా లుక్​లు, వీడియోలు లీక్ కావడం తలనొప్పిగా మారుతోంది. తాజాగా ఇలాంటి అనుభవమే 'లాల్​ సింగ్ చద్దా' చిత్రబృందానికి ఎదురైంది. ఇందులో హీరో ఆమిర్​ఖాన్​కు సంబంధించిన కొన్ని ఫొటోలు సోషల్​ మీడియాలో వైరల్​గా మారాయి. ఇప్పుడు వాటినే ట్రెండింగ్​ చేస్తున్నారు అతడి అభిమానులు.

లీకైన 'లాల్​ సింగ్​ చద్దా'లో ఆమిర్​ఖాన్ కొత్తలుక్​

ఇందులో ఆమిర్‌ లుక్‌ అధికారికంగా విడుదలైనా, లీకులు విషయంలో ముందస్తు జాగ్రత్తలు తీసుకున్నా.. వీటిని నిర్మాతలు అడ్డుకోలేకపోతున్నారని సమాచారం. ప్రస్తుతం షూటింగ్​ జరుపుకొంటున్న చిత్రాలకు ఇలాంటి జరగడం సర్వసాధారణమైపోయింది. కొంతమంది సినీ విమర్శకులు మాత్రం ప్రచారంలో భాగంగానే ఇలాంటివి జరుగుతున్నాయని అంటున్నారు.

'లాల్​ సింగ్​ చద్దా' సినిమా ఫస్ట్​లుక్
లీకైన 'లాల్​ సింగ్​ చద్దా'లో ఆమిర్​ఖాన్ కొత్తలుక్​

ABOUT THE AUTHOR

...view details