బాలీవుడ్ హీరోయిన్ కరీనా కపూర్ ఇన్‌స్టాగ్రామ్‌లో తన సహనటుడు ఆమిర్ ఖాన్‌కు పుట్టినరోజు శుభాకాంక్షలు చెప్పింది. ఇటీవలే ఇన్‌స్టాగ్రామ్ ఖాతా తెరచిన కరీనా.. ఆమిర్ విమానంలో దిండుని పట్టుకుని నిద్రపోతున్నప్పుడు తీసుకున్న ఫొటోను శనివారం పోస్ట్ చేసింది. 'నాకు ఇష్టమైన సహ నటుడు ఆమిర్ ఖాన్... దిండు!' అంటూ క్యాప్షన్ పెట్టింది.
కరీనా, ఆమిర్ ప్రధాన పాత్రల్లో 'లాల్ సింగ్ చద్దా' సినిమా తీస్తున్నారు. చిత్రీకరణ కోసం తాజాగా వీరిద్దరు ముంబయిలో కలుసుకున్నారు. ఆ ప్రయాణంలో ఆమిర్ దిండు పట్టుకుని నిద్రపోతుండగా.. 'చూడండి... ఆమిర్ విమానంలోనూ దిండు లేకుండా ప్రయాణం చేయలేరేమో?' అన్నట్లు కరీనా సెల్ఫీ తీసి అభిమానులతో పంచుకుంది. వీరిద్దరూ కలిసి 2009లో వచ్చిన 'త్రీ ఇడియట్స్', 2012లో వచ్చిన 'తలాష్'లలో నటించారు.