తెలంగాణ

telangana

ETV Bharat / sitara

ఆమిర్ ​ఖాన్​ ఇంట్లో కరోనా కలకలం - ఆమిర్​ఖాన్​ వార్తలు

తన సిబ్బందిలో కొంతమందికి కరోనా సోకిందని బాలీవుడ్​ హీరో ఆమిర్​ ఖాన్​ ఇన్​స్టా వేదికగా తెలిపారు. ప్రస్తుతం వారందరినీ క్వారంటైన్​లో ఉంచినట్లు స్పష్టం చేశారు. తనతో పాటు, మిగిలిన వారికి పరీక్షలు నిర్వహించారని వెల్లడించారు.

Aamir Khan confirms his staff tests COVID-19 positive, says 'rest of us tested negative'
ఆమిర్​ఖాన్​ సిబ్బందికి కరోనా

By

Published : Jun 30, 2020, 2:54 PM IST

బాలీవుడ్​ హీరో ఆమిర్ ​ఖాన్ సహాయక​ సిబ్బందిలో కొంతమందికి కరోనా పాజిటివ్​గా నిర్ధరణ అయ్యింది. వెంటనే వారిని క్వారంటైన్​లో ఉంచినట్లు ఆమిర్ సోషల్​ మీడియా వేదికగా​ తెలిపారు. తనతో పాటు, మిగిలిన సిబ్బందికి పరీక్షలు నిర్వహించగా నెగిటివ్​గా తేలిందని స్పష్టం చేశారు.

"అందరికీ నమస్కారం. నా సిబ్బందిలో కొంతమందికి కరోనా పాజిటివ్​గా తేలింది. వెంటనే వారిని క్వారంటైన్​లో ఉంచారు. ఇలాంటి పరిస్థితుల్లో బీఎంసీ అధికారులు వెంటనే స్పందించి వైద్య సదుపాయాలు కల్పించారు. బాధితుల్ని జాగ్రత్తగా చూసుకుంటూ మొత్తం సమాజాన్ని కాపాడుతున్న వీరికి నా కృతజ్ఞతలు తెలియజేస్తున్నా. ప్రతి ఒక్కరిపైనా దేవుడి కృప ఉండాలి. అందరూ సురక్షితంగా ఉండండి."

-ఆమిర్​ ఖాన్​, సినీ నటుడు

ప్రస్తుతం 'లాల్​ సింగ్​ చద్దా' చిత్రీకరణలో ఆమిర్​ బిజీగా ఉన్నాడు. హాలీవుడ్​ సూపర్​ హిట్​ 'ఫారెస్ట్​ గంప్'​ సినిమాకు ఇది రీమేక్​గా తెరకెక్కుతోంది.

ABOUT THE AUTHOR

...view details