'త్రీ ఇడియట్స్', 'తలాష్' చిత్రాల్లో నటించి అలరించింది ఆమిర్- కరీనా జోడీ. ఇప్పుడు హ్యాట్రిక్ హిట్ కొట్టేందుకు సిద్ధమవుతున్నారు. ప్రస్తుతం ఈ కథానాయకుడు ‘లాల్ సింగ్ చద్దా’లో హీరోగా నటిస్తున్నాడు. హాలీవుడ్ చిత్రం ‘ఫారెస్ట్ గంప్’ ఆధారంగా తెరకెక్కుతోంది. 'సీక్రెట్ సూపర్‌స్టార్' దర్శకుడు అద్వైత్ చందన్ రూపొందిస్తున్నాడు. వచ్చే ఏడాది క్రిస్మస్‌కు ఈ సినిమాను విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు.
ఆమిర్‌తో ఆ హీరోయిన్ మూడోసారి..!
ఆమిర్ ఖాన్ హీరోగా నటిస్తున్న 'లాల్ సింగ్ చద్దా'లో కరీనా కపూర్ హీరోయిన్గా నటించనుంది. వీరిద్దరికీ ఇది మూడో సినిమా. ఇంతకు ముందు 'త్రీఇడియట్స్', 'తలాష్'లో జంటగా కనిపించారు.
ఆమిర్‌తో ఆ హీరోయిన్ మూడోసారి..!
గతేడాది ‘వీరె ది వెడ్డింగ్’తో హిట్ అందుకున్న కరీనా... ప్రస్తుతం అక్షయ్ కుమార్ ‘గుడ్ న్యూస్’తో పాటు ఇర్ఫాన్ ఖాన్ ‘అంగ్రేజీ మీడియం’లో నటిస్తూ బిజీగా ఉంది.
ఇది చదవండి:అమ్మాయి నో చెప్పిందని ఆమిర్ ఏం చేశాడంటే..!