తమిళ నటుడు సూర్య హీరోగా సుధా కొంగర దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం 'సూరారై పొట్రు'. తెలుగులో 'ఆకాశం నీ హద్దురా'గా విడుదలవబోతుంది. కరోనా కారణంగా థియేటర్లు ఇంకా తెరుచుకోని నేపథ్యంలో అమెజాన్ ప్రైమ్ వేదికగా ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. తాజాగా ప్రమోషన్స్‌లో భాగంగా ఈ మూవీ ట్రైలర్‌ను విడుదల చేసింది చిత్రబృందం. సినిమాను నవంబర్ 12న విడుదల చేయబోతున్నట్లు ప్రకటించింది.
సూర్య 'ఆకాశం నీ హద్దురా' ట్రైలర్ వచ్చేసింది - దీపావళి కానుకగా ఆకాశం నీ హద్దురా
తమిళ నటుడు సూర్య హీరోగా నటించిన చిత్రం 'ఆకాశం నీ హద్దురా'. సుధా కొంగర దర్శకత్వం వహించారు. తాజాగా ఈ సినిమా ట్రైలర్‌ను విడుదల చేసింది చిత్రబృందం.

సూర్య 'ఆకాశం నీ హద్దురా' ట్రైలర్ వచ్చేసింది
ట్రైలర్ చూస్తుంటే ఎమోషనల్ రైడ్‌లా అనిపిస్తోంది. తక్కువ ధరకు విమాన ప్రయాణం కోసం ఓ ఫ్లైట్ కంపెనీని స్థాపించడానికి హీరో ఎంత కష్టపడ్డాడన్నదే స్టోరీ. ఎయిర్ దక్కన్ చీఫ్ జీఆర్ గోపీనాథ్ జీవితం ఆధారంగా ఈ సినిమా తీశారు. ఇందులో సూర్య సరసన అపర్ణ బాలమురళి హీరోయిన్గా నటించింది. కలెక్షన్ కింగ్ మోహన్‌బాబు కీలకపాత్ర పోషించారు. జీవీ ప్రకాశ్ కుమార్ సంగీతమందించగా, 'గురు' ఫేమ్ సుధా కొంగర దర్శకత్వం వహించారు.