రాధికా ఆప్టే, జాకీ ష్రాఫ్, విజయ్ వర్మ ప్రధాన పాత్రల్లో నటించిన 'ఓకే కంప్యూటర్' వెబ్‌సిరీస్ ట్రైలర్ విడుదలై సినీ ప్రియుల్లో ఆసక్తి రేపుతోంది. భారత్‌లోనే తొలిసారి సైన్స్‌ఫిక్షన్ కామెడీ థ్రిల్లర్ నేపథ్యంలో తెరకెక్కిందీ సిరీస్. ఆనంద్ గాంధీ దర్శకత్వం వహించిన ఈ ఆరు ఎపిసోడ్లు ఉన్న సిరీస్ మార్చి 26న డిస్నీప్లస్ హాట్‌స్టార్‌లో విడుదల కానుంది.
యువ కథానాయకుడు ఆది సాయికుమార్ నటిస్తోన్న కొత్త చిత్రం 'శశి'. సురభి నాయిక. మార్చి 19న సినిమా విడుదల కానుంది. ఈ నేపథ్యంలో చిత్ర ట్రైలర్‌ను మార్చి 10న ఉదయం 10.10 గంటలకు పవర్‌స్టార్ పవన్‌కల్యాణ్ విడుదల చేయనున్నట్లు ప్రకటించింది చిత్రబృందం.